అడ్డుకుంటే దేశం విడిచి పోతా..! - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డుకుంటే దేశం విడిచి పోతా..!

September 1, 2017

‘అర్జున్ రెడ్డి’ ఇపుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్.  అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్ అని కొందరు అంటుంటే, అసలు ఇది తెలుగు సినిమానే కాదు, తెలుగు సినిమాకు ఉండాల్సిన లక్షణాలు ఈసినిమాలో ఒక్కటి కూడా లేదు అని కొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా యూత్ ని మాత్రం ‘అర్జున్ రెడ్డి’ బాగా అట్రాక్ట్ చేస్తున్నాడనే చెప్పాలి.

అయితే ఈ సినిమాపై చాలా చోట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో ’అర్జున్ రెడ్డి’ సినిమా డైరెక్టర్  సందీప్‌ రెడ్డి వంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

‘సినిమాను అడ్డుకుంటే నేనుం చేయలేను..  మహిళా సంఘాలు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారో నాకు  అర్థం కావటం లేదు..  భవిష్యత్తులో కూడా ఇలాగే జరిగితే.. బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటా… అక్కడా అడ్డు తగిలితే అసలు భారతదేశమే వదిలి హాలీవుడ్‌లో ఇంగ్లీష్  సినిమాలు తీస్తూ బతికేస్తాను.. ’ అని సందీప్ అన్నారు.