పురుషుల ఐపీఎల్ మాదిరి మహిళా క్రికెటర్లకు వుమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ముంబైలో ఆటగాళ్ల వేలం ప్రారంభమవగా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి తమ సొంతం చేసుకుంటున్నాయి. స్మృతి మంధనను ఆర్సీబీ రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తెలుగు తేజం, ఆదోని అమ్మాయి అంజలి శర్వాణీపై కాసుల వర్షం కురిసింది. ఈమెను యూపీ వారియర్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నెలల క్రితమే అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన అంజలి.. తన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. అటు భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతోంది. దీంతో వేలం ప్రక్రియను మహిళా ఆటగాళ్లు అక్కడి నుంచే టీవీల్లో వీక్షించారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధన, ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ (రూ. 1.50 కోట్లు)లను ఆర్సీబీ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా ఆర్సీబీ నినాదం హోరెత్తింది. ఒకే జట్టుకు ఆడనున్న స్మృతి, రేణుకలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. మరోవైపు స్మృతి మంధన జెర్సీ నెంబర్, కోహ్లీ జెర్సీ నంబర్ 18 కావడం, ఇద్దరూ ఆర్సీబీకి ఆడనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తోంది.
Then, now, forever!
#18 is a Royal Challenger and we are screaming! You? 😬#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023