womens ipl auction in telugu cricketers list
mictv telugu

మహిళల ఐపీఎల్ వేలంలో నిలిచిన తెలుగు క్రికెటర్లు ఎవరంటే…

February 8, 2023

womens ipl auction in telugu cricketers list

మహిళల ఐపీఎల్ వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13న వేలానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. మొదటిసారి వేలం కావడంతో ఆటగాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలం కోసం మొత్తం 1525 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా వారిలో 409 మందిని మాత్రమే బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇందులో 264 మంది భారత క్రీడాకారిణులు ఉండగా, 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఐసీసీ అసోసియేట్‌ దేశాల నుంచి 8 మందికి చోటు దక్కింది. జట్టుకు 18 మంది చొప్పున మొత్తం 90 ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు కనకవర్షం కురిపించనున్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉండనున్నారు. తెలంగాణ, ఆంధ్రకు చెందిన పలువురు క్రికెటర్లు కూడా వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వివిధ ధరల కేటగిరీలో వారి పేర్లు రిజిష్టర్ అయ్యాయి.

రూ. 30 లక్షల కేటగిరీలో భారత మహిళల సీనియర్ జట్టుకు ఆడిన ఏపీ క్రీడాకారిణులు స్నేహ దీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘనతో పాటు హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి ఉండగా.. అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆడిన గొంగడి త్రిష, యశశ్రీతో పాటు హైదరాబాద్ నుంచి మదివాడ మమత, ప్రణవి, ఇషిత రూ. 10 లక్షల ప్రారంభ ధరలో నిలిచారు. ఏపీకి చెందిన అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యురాలు షబ్నిమ్ తో పాటు కట్టా మహంతి శ్రీ, వై. హేమ, బారెడ్డి అనూష, ఝాన్సీ లక్ష్మి, విన్నీ విన్నీ సుజన్.జి, శరణ్య, శ్రీచరణి రూ. 10 లక్షల విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నారు.

పురుషుల ఐపీఎల్ మాదిరిగానే ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఐపీఎల్…యంగ్ ప్లేయర్స్‎కు సువర్ణావకాశం అనే చెప్పాలి. తమ సత్తాను ఐపీఎల్ ద్వారా లోకానికి పరిచయం చేయోచ్చు. ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొత్తం ఐదు జట్లతో మార్చి 4వ తేదీ నుంచి ముంబైలో ఐదు జట్లతో తొలి సీజన్‌ మొదలుకానుంది. ఈ టోర్నీ ద్వారా ఎంతమంది యంగ్స్ ప్లేయర్స్ టాలెంట్ బయటకు వస్తుందో వేచి చూడాలి.