పేకాటలోనూ సమానమే.. 8 మంది జూదరాళ్ల అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

పేకాటలోనూ సమానమే.. 8 మంది జూదరాళ్ల అరెస్ట్.. 

November 25, 2019

పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేస్తే సాధారణంగా పురుషులే పట్టుబడతారు. కానీ దానికి భిన్నంగా ఓ ఎనిమిది మంది మహిళలు  పేకాట ఆడటం అందని ఆశ్చర్యానికి గురిచేసింది.ఏపీ రాజధాని కేంద్రంగా ఈ నయా ట్రెండ్ ప్రారంభమైంది. విదేశీ సంస్కృతిని తలపించేలా మహిళలు జూదం ఆడుతూ వీరంతా పట్టుబడ్డారు. అచ్చం సినిమాను తలపించే ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

Rummy.

మహిళలే కదా వారు ఆడే జూదంలో అంత పెద్దగా సొమ్ము మారే అవకాశం లేదనుకుంటే పొరపడినట్టే. వారి మధ్య వేలల్లో బెట్టింగ్ సాగుతోంది. మగవారికి మించి పెద్ద ఎత్తున బెట్టింగులు పెట్టుకుంటూ జూదక్రీడలో మునిగిపోయారు. మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేకాట చాలా కాలంగా సాగుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా 36 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న ముగ్గురు పురుషులు మాత్రం గోడదూకి పారిపోయారు. దీనిపై సమగ్ర విచారణ ప్రారంభించారు పోలీసులు. పారిపోయి వారికోసం గాలిస్తున్నారు.