టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68) అర్థసెంచరీతో రాణించగా, అయేషా నసీమ్ (25 బంతుల్లో 43) మెరుపులు మెరిపించింది. భారత్ బౌలర్లలో రాధాయాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొదట్లో వికెట్లు తీసి రాణించిన భారత్ బౌలర్లు చివరిలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బిస్మా, అయేషా జోడి ఏకంగా ఐదో వికెట్‌కు 51 బంతుల్లో 81 పరుగులు జోడించింది.