చీరలో ఆ లుక్కే వేరు.. ఈ వెరైటీ స్టైల్స్ కేక..! - MicTv.in - Telugu News
mictv telugu

చీరలో ఆ లుక్కే వేరు.. ఈ వెరైటీ స్టైల్స్ కేక..!

July 13, 2017

అమ్మాయిలు వివిధ రకాల డ్రెస్సులు వేసుకున్నా…చీరలో ఆ లుక్కే వేరు.విదేశి యువతులుకూడా మన చీరను ఇష్టపడుతున్నారు.
అంటే చీరలోని బ్యూటీ అర్థమౌతుంది.చీరలోని గొప్పతనం తెచ్చుకో ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అన్నారో కవి అలాంటి
చీర లో కొన్ని వెరైటీ స్టైల్స్ మీ కోసం.

సీతాకోకా చిలుక ..

దీన్నే బాలీవుడ్ చీరకట్టు అంటారు.షిపాన్,జార్జెట్,ప్యూర్ సిల్క్ లాంటి జాలువారే వస్త్రాలను ఎంచుకోవాలి.ఇంతకీ ఈ స్టైల్ ఎలానంటే
మాములుగా కట్టుకునే చీర కట్టుకు దీనికి తేడా ఏంటాంటే .!కొంగుకోసంపెట్టిన కుచ్చుళ్లన్నీ ఒకేచోట వచ్చేట్లుగా చేసి పిన్ను పెట్టేయాలి.
అవసరాని బట్టి అక్కడ బ్రూచ్ లేదా పిన్ పెట్టుకున్నా స్టైల్ గా ఉంటుంది. కాలేజీ ఫంక్షన్లలో చాలా బాగుటుంది.

ధోతి చీరకట్టు..

అందంగానే కాకుండా కంఫర్ట్ గా ఉంటుంది.షిఫాన్,జార్జెట్,వంటి వస్త్రాలు ఈ స్టైల్ కి బాగుంటాయి. ప్రింటెడ్ చీరలను ఎంచుకోవాలి.
ఎందుకంటే ధోతి స్టైల్ ను కనిపించనీవ్వదు.బ్లవుజుకి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే ,చీరను సాదాగా తీసుకోవాలి.

లైక్రా వస్త్రాలతో చేసిన టైట్స్ ని వీటికి జతగా ఎంచుకోవాలి.ఈ స్టైల్ లో ముందుగానే చెప్పులు వేసుకోవడం వల్ల తగిన హైట్ లో కట్టుకోవచ్చు.

లెహంగా కట్టు..

ఎక్కువ కుచ్చిళ్లు తీసుకునీ నడుము చుట్టూ వచ్చేలా ప్రయత్నించొచ్చు.లేకుంటే దుపట్టాను చీరలాగా నడుము దగ్గర నుంచి భుజాల
మీదగా వేలాడదీయవచ్చు.అలాగే పల్లూ కొంచం ఎక్కువ ఎంబ్రాయడరీ ఉన్నప్పుడు చోళీ లా ముందుకు వచ్చేలాకట్టుకోవచ్చు.
ఇలాంటప్పుడు ముందుబాగంలో కుచ్చిళ్లు తక్కువగా ఉన్న ఫర్వాలేదు.చీరకు రెండు వైపులా పెద్ద అంచులు ఉన్నప్పుడు ముందుకు
కనిపించేలా రెండు,మూడుకుచ్చిళ్లతో బాగుంటుంది.పెద్ద కుచ్చిళ్ల తో కింది భాగంలో స్కర్ట్ లా వెడల్పుగా కట్టుకుని మాములుగా కొంగు
వేసుకున్నా లెహెంగా లా కనిపిస్తుంది.సన్నగా ఉన్నవారికి ఈ స్టైల్ సెట్ కాదు. దీని మీద బ్లేజర్.జాకెట్ వేసుకున్న స్టైలిష్ గా ఉంటుంది.

మెర్మెయిడ్ ..

ఇది మాములు చీరకట్టు లాగానే కానీ కుచ్చిళ్లు పెట్టుకోవడంలోనే ఉంది విషయం.నడుము దగ్గర బిగుతుగా ఉండేలా కట్టుకోవాలి.కుచ్చిళ్లు సన్నగా తీసుకుని చివరన వేడల్పుగా వచ్చేలా చూసుకోవాలి. కొంగు ఎలాగైనా వేసుకోవచ్చు.

డబుల్ పల్లూ..

ఫంక్షన్ లో అందరి దృష్టి మన మీదనే ఉండాలింటే ఇలా చీరను కట్టుకుంటే సరి.మాములు చీరలాకట్టుకోవాలి.ఒకవైపు జాలువారేలాగా
వదిలి పిన్ను పెట్టుకోవాలి.వెనుకు వైపు వచ్చిన కొంగును స్టెప్స్ పెట్టుకోని కుడివైపు ముందుకు వేసుకుంటే చాలు.జాలువారే వస్త్రాలు
బాగుంటాయి.సన్నగా ఉండేవారికి బాగుంటుంది.

ప్యాయిట్ చీర..

లెగ్గింగ్ లు ఎంచుకోవాలి, సరిపడే బ్లవుజ్ కొంచెం పొడుగ్గా ఉండేవి వేసుకోవాలి .కుచ్చిళ్లు కాస్త వెడల్పుగా పెట్టుకుని .తరువాత కొంగు
వేసుకోని ,బిగుతుగా కాకుండా లెగ్గింగ్ ఒకవైపుకనిపించేలా బ్లవుజు పెట్టుకుంటే సరిపోతుంది.కాలేజీ పంక్షన్ లకు బాగుంటుంది.