Womens,Youth Voters Key Role in Munugode ByPoll
mictv telugu

మునుగోడులో గెలుపు వీళ్ల చేతుల్లోనే..!

November 1, 2022

Munugode ByPoll,Women Voters,Youth Voters,TRS,BJP,CONG

మునుగోడులో ఉప ఎన్నిక పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విశ్వప్రయత్నాలు చేసినా లాస్ట్ మినిట్ దాకా టెన్షన్ తప్పడం లేదు.వేసిన లెక్కలు తలకిందులైతే ఏంటి పరిస్థితి అని ఆందోళన చెందుతున్నాయి. ఏ పార్టీ గెలుపు అయినా వీళ్ల చేతుల్లోనే ఉంది. వాళ్ల ఓట్లు పడితేనే విజయం. లేదంటే ఫలితం తలకిందులే.ఇంతకీ ఎవరు వాళ్లంటే…?

యంగ్ మునుగోడు

మునుగోడులో మొత్తం ఓటర్లు 2.41 లక్షలు. ఇందులో సగానికి సగం మహిళల ఓట్లున్నాయి. అంతేకాదు యువత ఓట్లు సగానికి పైగా ఉన్నాయి. కొత్త ఓట్లల్లో వీరి సంఖ్యే ఎక్కువ. మునుగోడు సెగ్మెంట్ లో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 1.25 లక్షల మంది. ఈ ఓట్లే పార్టీలకు అత్యంత కీలకం. వీరు ఎటు వైపు మొగ్గుచూపితే అటు వైపే గెలుపు. ఇందులో నో డౌట్. ఎందుకంటే లక్షకు పైగా ఓట్లు.

చిక్కరు..దొరకరు

అసలే యూత్..ఎప్పుడు ఎక్కడ వుంటారో ఎవరికి తెలియదు. పార్టీలకు చిక్కడం లేదు. భూతద్దం వేసి వెతికినా నేతలకు కనిపించడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటమే కారణం. పోన్ చేసినా ఎత్తరు. మూడు,నాలుగుసార్లు ఫోన్ చేస్తేనే ఎత్తుతున్నారట. ఇంకొందరి అడ్రస్సే దొరకలేదట. ఇంకొందరు హైదరాబాద్‌లో ఉంటున్నారట. ఓట్లకొస్తామెని ఎక్కువమంది చెబితే..టైమ్ ఉంటే చూస్తామంటూ మరికొందరు అంటున్నారట. ఇప్పడు వీరిని మచ్చిక చేసుకోవడమే పార్టీలకు సవాల్ గా మారింది. ఎలాగైనా బూత్ దాకా యూత్‌ని రప్పించి ఓటేయించాలని మూడు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. వారికి నచ్చే గిఫ్ట్ ల్ని ఆశచూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది .యువత ఏపార్టీ వైపు మొగ్గుచూపుతారో వారికే విజయావకాశాలు ఎక్కువ.

మహిళలూ కీలకమే..

మునుగోడులో యువతే కాదు మహిళలు కీలకం..మొత్తం ఓట్లల్లో సగం మహిళా ఓట్లే ఉన్నాయి. అభ్యర్థి గెలుపునకు వీరు అత్యంత కీలకం.మునుగోడులో మూడుపార్టీలు మహిళలపై ఆశ పెట్టుకున్నాయి. మొత్తం 1లక్షా19 వేల 8 వందల 59 మహిళా ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్‌నే నమ్ముకుంది. 293 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. బూత్‌కు 25 చొప్పున కాంగ్రెస్ నాయకుల్ని రంగంలోకి దించింది. టీఆర్ఎస్ , బీజేపీలకు ఈ ఓట్లు పడకుండా చూడటమే వారి టార్గెట్. ఇక్కడి ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పడతాయో వారు గెలిచే అవకాశం ఎక్కువ.ఎందుకంటే తీన్మార్ వారైనా..గెలుపు ఓటములు టీఆర్ఎస్, బీజేపీ మధ్యే. ఓట్లు అన్నీ ఎలాగూ కాంగ్రెస్‌కు గంపగుత్తగా పడవు. వీరు మొగ్గుచూపిన రెండుపార్టీలు టీఆర్ఎస్, బీజేపీలో ఒకరిదే విజయం.

ఈ ఓట్లని మళ్లించగలిగితేనే…

ఇప్పటిదాకా ఒకఎత్తు..ఇక నుంచి మరోఎత్తు…ప్రచారం హోరాహోరీగా సాగించినా సెంటిమెంట్‌ని పండించడమే అసలుసిసలైన ఘట్టం. ముందుగా మూడు పార్టీలు మహిళా సెంటిమెంట్‌ని పండించాలి. ఇందులో ఎవరికి వర్కౌట్ ఎక్కవైతే వారిదే గెలుపు. ఇందులో ఎలాగూ కాంగ్రెస్ వుండదు కదా. అందుకే టీఆర్ఎస్ , బీజేపీలలో ఒకపార్టీదే విన్నంగ్. ఈ విక్టరీ కొట్టాలంటే యూత్ ఓట్లూ కీలకమే.వీరిని ఆకట్టుకోవడం పార్టీలకు అతిపెద్దపరీక్ష.ఎలా ఆకట్టుకోవాలో తెలియక తికమకపడుతున్నారు నేతలు. వీరిలో ఎవరైతే ఎక్కవ ఓట్లు సంపాదించిగలుగుతారో వారివే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.