అండమాన్‌లో రెండు సీట్లు గెలిచాం: టీడీపీ - MicTv.in - Telugu News
mictv telugu

అండమాన్‌లో రెండు సీట్లు గెలిచాం: టీడీపీ

March 10, 2022

006

కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ విషయాన్ని గురువారం టీడీపీ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది.

అండ‌మాన్‌లో స్థానికంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా, వాటిలో పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తూ ఉంటారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎప్ప‌టి మాదిరే టీడీపీ కూడా పోటీ చేసి రెండు వార్డుల్లో విజ‌యం కూడా సాధించింది. “కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వార్డులను గెలుచుకుంది” అంటూ పేర్కొంది.

మరోపక్క ట్వీట్‌ను చూసిన వెంటనే వైసీపీ ఎంపీ విజ‌య‌ సాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందిస్తూ టీడీపీపై సెటైర్లు వేశారు. ‘అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోంది. ఆంధ్రాలో ఇక ‘పార్టీలేదు-బొక్కాలేద’ని నిర్ధారించుకున్న అచ్చెన్న కూడా త్వరలో అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.