అధికార బలంతో గెలిచారు - MicTv.in - Telugu News
mictv telugu

అధికార బలంతో గెలిచారు

October 24, 2019

Won with the power.. BJP MLC Naraparaju Ramachandrarao

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ గెలుపుపై బీజేపీ ఎమ్మెల్సీ నరపరాజు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ధనబలం ముందు తాము ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారం, ధనబలంతో టీఆర్ఎస్ గెలిచింది. అయినా ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేవు. కేసీఆర్‌ ప్రభుత్వం హుజూర్‌నగర్‌ గెలుపుతో అహంకారం పెంచుకోవద్దు. స్థానికంగా హుజూర్‌నగర్‌లో బీజేపీ బలంగా లేదు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది’ అని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. 

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు.. ఆర్టీసీని అణిచివేయడానికి ఆమోదముద్ర కాదు అన్నారు. ప్రభుత్వం అహంకారాన్ని పక్కనపెట్టి, ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. లీగల్ బాడీస్ కార్మికులు, ట్రేడ్ యూనియన్లకు.. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేమో వారికి స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ఉన్నపళంగా 48 వేల మంది కార్మికులను తీసేస్తే.. అందుకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నేతలపై.. ఎందుకు ప్రధాని మోదీకి లేఖ రాశారని ప్రశ్నించారు. కార్మికులకు పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలకు, కోర్టుకు వెళ్లొద్దంటే వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కో విధానం ఉందని, ఆర్టీసీని అంతమొందించాలని చూస్తున్నారని అన్నారు.