కలెక్షన్ క్వీన్ – వండర్ వుమెన్ - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్షన్ క్వీన్ – వండర్ వుమెన్

June 14, 2017

‘‘ వండర్ వుమెన్ ’’ సినిమా బాక్సాఫీసును ఒక ఊపు ఊపి పారేస్తున్నది. కలెక్షన్ల మోత మోగిస్తున్నది. చూసినోళ్ళంత     ‘ వహ్వా.. వహ్వా.. క్యా ఫిల్మ్ హై బాప్, సూశినకొద్ది సూడాలనిపిస్తున్నది.. యమ్మ జీవితం ఏమన్న సినిమా తీశిర్రా.. తీస్తె గీస్తె గిట్లుండాలె.. ,’ అని శిగాలూగినంత పని జేస్తున్నరు వండర్ వుమెన్ వుమెన్ ని చూసి. కళ్ళు మెస్మరైజయ్యే దృశ్యాలతో సినిమా మొత్తం ఇంట్రెస్టింక్ గా సాగుతుంది. రిలీజైన మూడు రోజులకే 1435 కోట్లు వసూలు చేసిందంటే అంచనా వెయ్యొచ్చు ఈ సినిమా ఎంతగా జనాలకు ఇంజెక్ట్ అయిందో.. ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో…

స్టార్లు లేరు

పెద్ద పెద్ద స్టార్లుంటేనే సినిమాకి మినిమమ్, మ్యాగ్జిమమ్ గ్యారెంటీలిస్తారు. కానీ వండర్ వుమెన్ లో స్టార్ కాస్టింగ్ అస్సలు లేదు. ఎవరికీ అంతగా నోటీస్ కాని ఫిగర్ ఇజ్రాయెల్ నటి గాల్ గడోట్ టైటిల్ రోల్ లో దిమ్మ దిర్గి పోయే పర్ ఫార్మెన్స్ చూపించింది. ప్యాట్నీ జెన్కిన్స్ అనే లేడీ డైరెక్టర్ ఈ వండర్ ను ప్రేక్షకులకు అందివ్వడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి.  ప్రియాంక ఛోప్రా బేవాచ్ ను , టామ్ క్రూయిజ్ మమ్మీని ఈడ్చి తన్నినంత పని చేసింది వండర్ వుమన్ ! కలెక్షన్ల సునామీ కురుస్తోంది. ఈ దెబ్బకు బాహుబలి రికార్డు ఏ స్థాయికెళ్లిందో అందాజెయ్యొచ్చు. కొత్తవాళ్ళే మ్యాగ్జిమమ్ చేసిన ఈ సినిమా అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తున్నది. హిట్ ఫార్ములాకి స్టార్లను లింక్ చెయ్యడం రాంగ్ లెసన్ అని సుపూత్ చేసిన వండర్ వుమన్ సినిమా స్టార్ల తలబిరుసుతనానికి థప్పడ్ ఇచ్చినట్టైంది ! ? ఆడవాళ్ళు అందునా కొత్తవాళ్ళైనా మస్త్ జబర్దస్త్ హిట్టును ఒళ్ళో వేసేస్కొని కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారనే చెప్పుకోవాలి.

 సూపర్ – డూపర్లు మ్యాన్లేనా ?

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, మ్యాన్, మ్యాన్.., మ్యాన్ తప్ప వుమెన్ లేదా ? వుమెన్ సూపర్ కాదా ? వుమెన్ వండర్స్ చెయ్యలేదని మ్యాన్స్ ఫిక్సయిపోయారా ? లేడీ లేకుండా మెన్ లేడు.. మరి సినిమాకొచ్చేసరికి లేడీకి ఇంపార్టెంట్ లేకుండా సినిమా ఎలా వుంటుంది. భర్త, ఇల్లూ, పిల్లలను చూస్కున్నంత మాత్రాన లేడీ నిస్సహాయురాలా ? లేడీ అంటే గ్లామర్ డాలేనా ?

హాలీవుడ్ 

రూపాయిలో బారానా వంతు హాలీవుడ్ నయం.. అక్కడి సినిమాల్లో లేడీకి కూడా మెన్ తో సమానమైన రోల్ వుంటుంది. ఇప్పటివరకొచ్చిన చాలా మటుకు హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లకు హీరోలతో సమవుజ్జీగా క్యారెక్టర్ వుండింది. Forgo,easy A, p2, మిలియన్ డాలర్ బేబీ, సాల్ట్.., వంటి చాలా వరకు సినిమాలు లేడీ ప్రధానంగా వచ్చిన సినిమాలు. అక్కడ వాళ్ళు మగాళ్ళు ఎక్కువ – ఆడవాళ్ళు తక్కువనే ఫీలింగులో అస్సలుండరు. అందుకే అక్కడొచ్చినన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కడా రాలేవు. మరి మన దగ్గర ??

బాలీవుడ్

ఇంక హాలీవుడ్ తర్వాత చెప్పుకోదగ్గ లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాలీవుడ్ లో  ఓ మోస్తరుగానే వచ్చాయి. అక్కడ కొంత మేల్ డామినేషన్ వుంటుందనే విషయం తెల్సిందే. అయినా అక్కడ రూపాయిలో ఆఠానా వంతు లేడీ ఓకియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. అస్థిత్వ, దామిని, మిర్చి మసాల, మదర్ ఇండియా, జుబేదా, ఓంకారా, దుష్మన్, కహానీ, గులాబ్ గ్యాంగ్, డర్టీ పిక్చర్, ఇంగ్లీష్ వింగ్లిష్, క్వీన్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఫ్యూచర్లో వస్తాయి కూడా.

 టాలీవుడ్

‘ ఏమైంది ఈ నగరానికి ? ఏమైంది ఈ టాలీవుడ్ కు ? ’ అన్నట్టు తయారైంది మన టాలీవుడ్ స్థితి !? ‘ లడ్కీ మర్ద్ కే లియే హానికారక్ హై ’ అనే పాగల్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న మన తెలుగు సినిమా ప్రబుద్ధులు ఆడవాళ్ళ మీద వున్న చీప్ మైండ్ సెట్ లో మార్పు రాదేమో.. ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ? మొదటి నుండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళను వస్తువు కన్నా హీనంగా చూస్తారనేది బండ మీద రాత లాంటి నిజం. పెద్ద పెద్ద హీరోలమని చెప్పుకునే లిస్టాఫ్ హీరో బాలకృష్ణ  ఆ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో స్త్రీల గురించి ఎంత ఛీప్ గా మాట్లాడాడో అందరికీ తెలుసిందే. ఒసేయ్ రాములమ్మ, పవిత్ర తప్పించి ఎక్కడొచ్చాయ్ మన దెగ్గర లేడీ ఓరియంటెడ్ సినిమాలు విజయశాంతి హీరోయిన్ గా రిటైరయ్యాక అలాంటి సినిమాలు రావడం చాలా తక్కువైంది. ఏమన్నా అంటే మన దెగ్గర ఆ లెవల్ ఆక్ట్రెస్ లేరని చల్లగా సమాధానం చెప్తున్నారు. నిజంగానే మన దెగ్గర లేరా ?ఎందుకు లేరు ? బోలెడంత మంది వున్నారు.. తెలుసు, బట్.. ఎంకరేజ్ చేయకూడదు.. ఎందుకంటే వాళ్ళ పురుష భావజాలం ఆడవాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలంటే అస్సలు ఒప్పుకోదు. పైగా బిజినెస్ కాదని ఫిక్స్ అయిపోయారెప్పుడో ! మనవాళ్ళకి సినిమా అంటే వ్యాపారం తప్ప విలువలు, పుల్కా, పుంటికూర అస్సలు కాదు. అందుకోసం అమ్మాయి గ్లామర్ వాడుకోవాలి గానీ అమ్మాయి సినిమానెలా నిలబెడుతుంది ? తెలుగు సినిమా గ్రామర్ కి అమ్మాయి గ్లామర్ అవసరం చాలా వుంది. ఆడవాళ్ళను గౌరవించని తెలుగు సినిమాకి గ్రామర్ కూడా ఒకటి ఏడ్చిందా ? డేరింగ్ డ్యాషింగ్ లేడీలు లేరంటారు కూడా. తెర మీద దుమ్ము దుమ్ము ఫైట్లు చేసే హీరోలందరూ డేరింగ్ డ్యాషింగులేనా ? ఆ తుచ్ తుచ్ సాహసాలు, ఫైట్లు అమ్మాయి మీద షూట్ చేస్తే ఎందుకు రాదు ? రియల్ లైఫ్ లో ప్రతీ కుటుంబానికి మగాడే హీరోనా ? మొగుడి అండ లేకుండా ఎందరో స్త్రీలు హార్డ్ లైఫ్ ని ఎన్ని స్ట్రగుల్స్ చేస్తూ లీడ్ చేస్తున్నారో.. అలాంటి కథలతో సినిమాలు తీస్తే హిట్టవ్వవా ?

 మన హీరో వేషాలు

మన తెలుగు సినిమాలో మీడియా ముఖంగా కనిపించేదొకటి, ఇన్నర్ గా కనపడనిది ఇంకొకటి. బహుశా అదెప్పటికీ బయటకు రాదేమో ? మన హీరోలకు స్టార్ హోదాలివ్వటం, వాళ్ళు ఆ హోదా కోసం పాకులాడటం, ఆ రేసులో ఎవర్నెవర్నో తొక్కేయటం, వీళ్ళు మెగా, మైటీ, లూటీ, బోటి ఎక్సెట్రా ఎక్సెట్రా.., స్టార్లుగా చెలామణి అవుతున్నారు. ఏ ఇండస్ట్రీలో లేని విధంగా మన దెగ్గర హీరోనే డైరెక్టర్ ని డామినేట్ చేసి కథలో మార్పులు, హీరోయిన్ చూజింగు, అదర్ ఆర్టిస్టుల సెలక్షన్లన్నీ ఆయనే దగ్గరుండి మరీ డిసైడ్ చేస్తున్న సందర్భాలు చాలా !?కాదూ కూడదంటే హీరో గారికి కోపమొచ్చి డేట్సివ్వరని డైరెక్టర్లు కింద మీద మూస్కొని చుప్ చాప్ గా నామ్ కే వాస్తె డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఇతర టెక్నీషియన్ల దెగ్గరికొస్తే రైటరేమో డైరెక్టర్ కి భయపడ్తాడు.. అమ్మో నన్ను మార్చి నా ప్లేసులో వేరే రైటర్ ని పెట్టుకుంటారని అతను కూడా ఏమీ అనడు. ఇలా వన్ బై వన్ అందరూ ఒకరితో ఒకరు భయపడుతుంటారు. ఓవరాల్ గా హీరోగారికి టీం అందరూ భయంతో పని చేస్తుంటారు. క్రియేటివిటీ వున్న చోట భయం అనేది వుంటే క్రియేటివిటీ ఎక్కడినుండి వస్తుంది ?

రూలర్ 

మన దెగ్గర రూలర్ హీరోనే. వారసత్వాన్ని అడ్డు పెట్టుకున్న కుర్ర హీరోలు చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. అసలు సమజే గాదు !? టోటల్ కథలో హీరోనే కనబడాలి.. హీరోయిన్ కేవలం హీరో ఫైట్ చేసి అలిసిపోయొస్తే చల్లని ఐస్ వాటర్ ఇచ్చే విధంగా వుండాలి తప్ప కథకి హీరోయిన్ ఎప్పుడూ కీ రోల్ అవకూడదని కొత్త స్క్రీన్ ప్లే తరీఖను ప్రవేశపెట్టిన ఘనత మన తెలుగు సినిమా హీరోలకే దక్కుతుంది. ఇంక కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు అమ్మాయిలతో కమిట్ మెంట్లకు ఫిక్స్ అవుతున్నారు. హీరో రూలర్ గా వున్నంత కాలం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి దౌర్భాగ్యపు హీరో కమర్షియల్ బేస్డ్ సినిమాలు తప్ప లేడీ ఓరియంటెడ్ రావనేది ఫత్తర్ మీద లిఖ్ఖిర్ లాంటిది !

టాలీవుడ్ కి అమ్మాయి

మన టాలీవుడ్ కి అమ్మాయి ఖోవా లాంటిది. ఆ ఖోవా మీద వాలే ఈగల్లాంటివాళ్ళు మనోళ్ళు. గొప్పోళ్ళు.. అమ్మాయి ఇండస్ట్రీకొచ్చిందంటే ఎలా వాడుకోవాలా అనే చూస్తున్నారు తప్ప తన ఆంభిషనేంటి ? దానికి మనమెలా హెల్ప్ అవగలమని ? జర్రంత గూడ సోంచాయించకపోవడం గొప్ప దరిద్రం. అమ్మాయి వస్తువు, వాడుకొని వదిలేద్దాం.. ఈ ఫక్తు లంగా మైండును మార్చుకోని ప్రబుద్ధుల నడుమ లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కడినుండి వస్తాయి ? అమ్మాయి షకీలాలా అవతారమెత్తితే గానీ గత్యంతరం లేని భావ దరద్రంలో మగ్గిపోతోంది టాలీవుడ్ ? ఎప్పుడు మరి మన దెగ్గర రాములమ్మ తర్వాత అలాంటి సినిమాలు వచ్చేవి ? ఏం చెయ్యాలి ? హీరోయిన్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ గానే భావిస్తున్న ఈ మేల్ డామినేషన్ లో ఛేంజెస్ ఎప్పుడొస్తాయి ? వండర్ వుమెన్ లాంటి ఎన్ని సినిమాలు వచ్చినా మన వాళ్ళు వాటిని ఇన్ స్పిరేషన్ గా తీస్కోరు, అసలు ఆ జోలికే వెళ్ళరు. వచ్చినప్పుడు అందరితో సహా చూస్తారు

వదిలేస్తారు అంతే.. కొన్ని భయాల్లో బతుకుతున్న మన టాలీవుడ్ డేర్ గా ఎప్పటికి కళ్ళు తెరుచుకుంటుందో మరి ? వారసత్వ నటుల ముక్కూ మొహాలు సరిగ్గా లేకపోయినా ప్రేక్షకులు వాళ్ళు నటించిన సినిమాలు చూసి హిట్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను కూడా బాగుంటే హిట్ చేస్తారేమో కదా ? అసలు ప్రేక్షకుల నాడీ పట్టుకోకుండానే మేము వాళ్ళు మెచ్చే సినిమాలే తీస్తున్నామని దరిద్రపు గొట్టు కమర్షియల్ సినిమాలను వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇలాంటివే మేము చేస్తాం మీరు చూడాల్సిందేనన్నట్టున్నాక పాపం జనాలేం చేస్తారు.. చచ్చినట్టు చూసేస్తున్నారు ! ? అది వాళ్ళకు హిట్ ఫార్ములాలా కనిపిస్తున్నది. ఛ.. ఎప్పటికి మారతారో.. మన తెలుగులో బాహుబలుల లాంటి గొప్ప సినిమాలనుకునేవి ఎన్ని వచ్చినా స్త్రీలు అందులో సపోర్టింగ్ క్యారెక్టర్ గానే వుంటారు తప్పితే రుద్రమదేవిలా ఫ్లాప్ అవుతారు. లేదంటే మన వర్మ ‘ మేరీ బేటీ సన్నిలియోని బన్నా చాహ్తీ హై ’ లా అమ్మాయిలను ప్రిపేర్ చేస్తే వాళ్ళతో పోర్న్ సినిమాలు తియ్యడానికి ముందుకొస్తారేమో.. ఎందుకంటే కమర్షియాలిటీకి గ్లామర్ బట్టలిప్పుకొని క్యాష్ చేస్తుంది కదా ?  మన వాళ్ళను ఎవ్వరూ మార్చరు. ప్రపంచ సినిమా ఒక వైపుంటే మన తెలుగు సినిమాల ప్రయాణం ఒక వైపు వుంటుంది. మొత్తానికి వండర్ వుమెన్ చాలా మంది సినిమావాళ్లకి గొప్ప ఇన్ స్పిరేషన్ గా నిలిచింది మన టాలీవుడ్ ను మినహాయించి !!

– సంఘీర్