అది దీపిక ఇష్టం, నేనైతే తుక్డే గ్యాంగుకు మద్దతివ్వను.. కంగన - MicTv.in - Telugu News
mictv telugu

అది దీపిక ఇష్టం, నేనైతే తుక్డే గ్యాంగుకు మద్దతివ్వను.. కంగన

January 17, 2020

Kangana Ranaut

ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతు తెలిపిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనెపై మరో వివాదాల నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది. జేఎన్‌యూకు వెళ్లిన దీపిక మౌనంగా నిలబడటం ఆమె ఇష్టమని.. తానైతే అలాంటివాళ్లతో నిలబడేది లేదని స్పష్టం చేసింది. ఓవైపు దీపిక నటించిన ‘చపాక్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన కంగన.. జేఎన్‌యూ విషయంలో విమర్శలు కూడా ఎక్కుపెట్టడం గమనార్హం. 

జేఎన్‌యూ విద్యార్థులను ‘తుక్డేగ్యాంగ్’ అంటూ కంగన ఎద్దేవా కూడా చేసింది. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. జేఎన్‌యూ విద్యార్థులను అమిత్‌షా స్టైల్లో ‘తుక్డే గ్యాంగ్’ అంటూ ఘాటుగా విమర్శించింది. ‘దీపికకు జేఎన్‌యూ విద్యార్థులతో కలిసి నిలబడే హక్కు ఉంది. అది తప్పో ఒప్పో నేను చెప్పకూడదు. కానీ నేనైతే దేశాన్ని విభజించాలని అనుకునేవారికి అస్సలు మద్దతు ఇవ్వను. అలాంటి తుక్డేగ్యాంగ్‌తో కలిసి నిలబడను’ అని విమర్శించింది. దీనిపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి.