దేశంలో అతిపెద్ద కరోనా ఆస్పత్రి.. తెలుగు రాష్ట్రాల పక్కనే.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో అతిపెద్ద కరోనా ఆస్పత్రి.. తెలుగు రాష్ట్రాల పక్కనే..

March 26, 2020

Work started in odisha for Covid-19 dedicated hospital

కరోనా నియంత్రణకు దేశం యావత్తు ఒక్క తాటిపైన ఉంది. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19పై రణభేరి మోగించడానికి దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్) ఆసుపత్రిని  నిర్మించేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధం అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తోంది. ఇది మన దేశంలోనే తొలి కోవిడ్-19 ఆసుపత్రి కానుంది. రెండు వారాల్లోనే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ప్రత్యేకంగా కరోనా రోగులకు ఈ ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. ఇందుకు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై ఒడిశా ప్రభుత్వం, కార్పొరేట్లు, మెడికల్ కాలేజీలు ఇవాళ(మార్చి-26,2020) సంతకాలు చేశారు. 

రోజురోజుకు దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను అదుపు చేయాలంటే ఆసుపత్రి తప్పనిసరి అని భావించింది ఒడిశా ప్రభుత్వం. దేశంలో ఇప్పటికే విస్తరించిన వైద్య పరికరాల భారాన్ని కొంతమేర తగ్గించడమే ఈ ఆసుపత్రిని నిర్మించడం వెనుక ఉన్న లక్ష్యం. కాగా, ఒడిశాలో ఇప్పటివరకు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఒడిశాలో 82వేల 248మంది సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.