సామాజిక సేవాకార్యక్రమాల్లో ముందుండే వర్కాగ్(Workcog) కంపెనీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి వర్ధమాన బాస్కెట్ బాల్ క్రీడాకారుడికి చేయూత అందించారు. ఈ నెల 13 న చెన్నైలో జరగబోతున్న సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఆర్హత సాధించిన నూతక్కి వినయ్ భాస్కర్‌ను అభినందిస్తూ ఏహెచ్ఆర్ ఫౌండేషన్ తరుపున రూ. 15వేలు విలువ గల స్పెషల్ బాస్కెట్ బాల్ షూలను బహుమతిగా అందించారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ ఎంతో కష్టపడి బాస్కెట్ బాల్ క్రీడలో ముందుకు దూసుకెళ్తున్నాడని అప్పిరెడ్డి కొనియాడారు. అతడు నేషనల్ చాంపియన్ షిప్లో విజయం సాధించాలని ఆకాక్షించారు. భాస్కర్ లాంటి వర్ధమాన క్రీడాకారులకు అందరూ అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చక్రధరరావు, చరిత్, గొపిదేశి వివేకానంద తదిరులు మాట్లాడారు. ప్రతిభావంతులపై విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.