మా జీవితాలు కట్ కాకూడదంటే మీకు ఇలాగే కట్ చేస్తాం..  - MicTv.in - Telugu News
mictv telugu

మా జీవితాలు కట్ కాకూడదంటే మీకు ఇలాగే కట్ చేస్తాం.. 

May 14, 2020

haircuts

కరోనా వైరస్ ప్రజల్లో కొత్త కొత్త భయాలను పుట్టించింది. దాని బారిన పడకుండా ఉండటానికి అందరూ బహు జాగ్రత్తగా మసలుకుంటున్నారు. ఈయనను చూశారుగా. బార్బరే. కరోనా నుంచి తనను కాపాడుకోడానికి కోవిడ్ డాక్టర్లు వేసుకుని పీపీఈ కోట్. గ్లాస్ మాస్క్ ధరించాడు. కస్టర్ కూడా మాస్క్ పెట్టుకున్నాడు. ఎవరికి కోవిడ్ ఉందో బయటికి కనిపించదు కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నానని బార్బర్ చెప్పాడు.గుజరాత్ లోని ఖేడా  ప్రాంతంలో ఉన్న సెలూన్లో ఈ వింత కనిపించింది. 

కరోనా లాక్‌డౌన్‌లో సెలూన్లు మూతపడ్డడం తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని కూడా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. కేవలం మాస్కులు  మాత్రమే కరోనాకు అడ్డుకట్ట వేయవు కనుక ఈ సెలూన్ బార్బర్ కష్టపడి పీపీఈ కిట్ ధరించి పని మొదలెట్టాడు. ఎంత నాసిరకం కిట్ అయినా కనీసం 1200కు పైగానే ఉంటుంది కనుక కటింగ్ చార్జీలు కూడా పెంచేశారు. అయినా తలమాసిన జనం ఎల్లకాలం అలాగే ఉండలేరు కనుక క్షవరంతోపాడు డబ్బు క్షవరం కూడా చేయించుకుని ఇస్మార్ట్ గా తయారవుతున్నారు.