ఆఫ్రికా దేశమైన చాద్లోని బంగారు గనుల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గనుల్లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్టుకున్నారు. ఫలితంగా వందల మంది చనిపోయారు. దాదాపు 200 మంది చనిపోయి ఉంటారని లిబియా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ వెల్లడించింది.
ఉత్తర చాద్లోని కౌరీ బగౌడీ పర్వత ప్రాంతాల్లోని బంగారు గనుల్లో ఈ ఘర్షణ జరిగింది. టామా వర్గానికి, ఓ అరబ్ గ్రూపుకు మధ్య ఈ గొడవ జరుగగా, తవ్వకాల సమయంలో కార్మికుల మధ్య వాగ్వాదంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఫలితంగా వందల మంది చనిపోవడంతో పాటు మరికొన్ని వందల మందికి తీవ్ర గాయాలైనట్టు స్థానిక మీడియా తెలిపింది.