అణు పరీక్షలతో అమెరికాను సుస్సు పోయిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను అంతం చేసేందుకు దక్షిణ కొరియా కొత్త ప్లాన్ వేసినట్లు పుకార్లు వస్తున్నాయి. కిమ్ జోంగ్ ను అంతం చేసేందుకు తయారు చేసిన స్పెషల్ టీం ను ఏర్పాటు చేసినట్లు వస్తున్న వార్తలపై ఇరు దేశాల నుండి ఇప్పటి వరకైతే ఎలాంటి స్పందనా లేదు. అయితే కిమ్ జోంగ్ తో పాటు ఉత్తర కొరియన్ల తలలు నరికి తేవడానకి ’’స్పార్టన్ 300‘‘ పేరుతో ఓ టీం ను ఏర్పాటు చేశారని సమాచారం.
గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే దక్షిణ కొరియాన్లు చేశారు. అయితే వారి వ్యూహం బెడిసి కొట్టడంతో టీం సభ్యులు తప్పించుకున్నారు. కొందరు ప్రాణాలు తీసుకున్నారు. అధ్యక్ష భవనంలోకి వచ్చి అప్పటి అధ్యక్షుడు సంగ్ ను అంతం చేయాలని అనుకున్నారు. అది ఫెయిల్ అయింది. తాజాగా మరో సారి దక్షిణ కొరియన్లు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తున్నది.
ను ఏదో రకంగా భయపెట్టాలని అనుకుంటున్నారట. అందుకోసం రిస్క్ అయినా సరే ఆయనను భయ పెట్టాలనేది దక్షిణ కొరియన్ల ప్లాన్ అంటున్నారు. స్పార్టన్ టీం హెలికాప్టర్లు, ట్రాన్స్ పోర్టు విమానాలతో అర్థరాత్రి పూ బోర్డర్ దాటి వెళ్లి ఉత్తర కొరియన్ల తలలు నరకాలని ప్లాన్ వేస్తున్నారట. అయితే దక్షిణ కొరియా వేస్తున్న ప్లాన్ వెనుక అమెరికా ఉందనే ప్రచారమూ ఉంది. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుందో యుద్ద వాతావరణం ఉంది. ఇలాంటి చర్యల వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో మరి.