Workman Subhash made sensational allegations against actress Parvathy Nair
mictv telugu

హీరోయిన్ పార్వతీనాయర్‌‌పై పనిమనిషి సంచలన ఆరోపణలు

November 11, 2022

Workman Subhash made sensational allegations against actress Parvathy Nair

సౌత్ హీరోయిన్ పార్వతీనాయర్‌‌పై ఆమె ఇంట్లో పని చేసే పనిమనిషి సుభాష్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను కావాలనే చోరీ కేసులో ఇరికించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకా, తనను రెండు సార్లు చెంప దెబ్బ కొట్టి ముఖంపై ఉమ్మేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మాట వినకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతానని వేధిస్తోందని తెలిపాడు.

అసలేమైందంటే.. చెన్నైలోని నుంగంబాక్కంలోని పార్వతీ నాయర్ ఇంట్లో గత అక్టోబరు నెలలో రూ. 9 లక్షల విలువ చేసే రెండు వాచీలు, లక్షన్నర విలువ కలిగిన ఐఫోన్, రెండు లక్షల విలువున్న ల్యాప్ టాప్ చోరీకి గురైందని, పనిమనిషి సుభాశే వాటిని దొంగిలించాడని పార్వతీనాయర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఓపెన్ అయిన సుభాష్.. రాత్రిపూట ఆమె ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు రావడం చూసినందుకే తనను మానసికంగా వేధిస్తోందని వాపోయాడు. దీంతో ఈ విషయం కోలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌‌గా మారింది. కాగా, అబుదాబిలో పుట్టిన పార్వతీ నాయర్.. కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో ఇంతవరకు ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకునే హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంటుంది ఈ భామ. తమిళంలో యెన్నై అరిందాల్, నిమిర్ చిత్రాల్లో నటించగా, ఇప్పటివరకు మూడు భాషల్లో కలిపి 20కి పైగా చిత్రాల్లో నటించింది.