భారతదేశంలోని మహిళల్ల ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్స్ గుర్తించబడ్డాయి. యేటా దాదాపు 7 లక్షల మంది క్యాన్సర్ రోగాన బారినపడుతున్నారు.
భారతీయ మహిళల్లో రొమ్ము, గర్భాశయం, పెద్ద పేగు, అండాశయ, నోటి క్యాన్సర్ సాధారణంగా కనిపిస్తాయి. సరైన సమయంలో క్యాన్సర్ ని గుర్తిస్తే ఈ యుద్ధంలో గెలుస్తారు. ఒక సర్వే ప్రకారం.. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ మరణిస్తున్నది. క్యాన్సర్ అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2015 నివేదిక ప్రకారం.. మహిళల్లో క్యాన్సర్ మూడు లేదా నాల్గవ దశలో గుర్తించబడుతుంది. దీని కారణంగా రోగి జీవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కారణమేంటి..?
మహిళల్లో క్యాన్సర్ రావడానికి చాలా కారణాలున్నాయి. ఇది అంతర్గత, బాహ్య అంశాలను కలిగి ఉంటుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్ కేసుల్లో 6 నుంచి 8శాతం జన్యుపరమైనవి. జీవనశైలి కారకాలు.. ఊబకాయం, ధూమపానం, మద్యపానం, చాలా సందర్భాల్లో.. రుతుస్రావం ప్రారంభం లేదా ఆలస్యం అవ్వడం కూడా దీనికి కారణమవచ్చు. వాయు కాలుష్యం, కలుషిత ఆహారం, కలుషిత నీటి వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మహిళల్లో ప్రాణాంతక క్యాన్సర్.. వాటి లక్షణాలు :
1. రొమ్ము క్యాన్సర్ :
ఈ క్యాన్సర్ సాధారణంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో కనిపిస్తుంది. గ్రామీణ మహిళల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రస్తుతం చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇది రొమ్ములోని కణాల అసాధారణ పెరుగుదల, మార్పు వలన సంభవిస్తుంది. ఈ కణఆలు కలిసి కణితిని ఏర్పరుస్తాయి.
లక్షణాలు : తెల్లటి మిల్కీ డిశ్చార్జ్ లేదా రక్తస్రావం, రొమ్ము చర్మం పై నారింజ తొక్కలా కనిపించడం, రొమ్ము లేదా చంకలో గడ్డ, రొమ్ము ముందు భాగం లోపలికి వెళ్లడం, ఆకారంలో మార్పు.
2. సర్వైకల్ క్యాన్సర్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ సర్వైకల్ రీసెర్చ్ ప్రాకం.. 2015 సంవత్సరంలో గర్భాశయ క్యాన్సర్ కారణంగా భారతదేశంలో సుమారు 63వేల మంది మహిళలు మరణించారు. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ క్యాన్సర్ గర్భాశయంలోని అత్యల్ప భాగం, యోని మార్గం ఎగువ భాగంలో ఉన్న గర్భాశయ ముఖద్వారంలో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ఈ క్యాన్సర్ క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
లక్షణాలు : రుతు చక్రం మధ్యలో రక్తస్రావం, సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం, అసాధారణమైన ఉత్సర్గ హెచ్చరిక సంకేతాలు.
3. కొలొరెక్టల్ క్యాన్సర్
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది మూడోది. ఇది పెద్ద పేగులను ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇది క్యాన్సర్ కణాల సమూహంగా ప్రారంభమవుతుంది. ఇది విస్మరించినట్లయితే క్యాన్సర్ గా మారుతుంది.
లక్షణాలు : అతిసారం లేదా మలబద్దంకం, నాలుగు వారాల కంటే ఎక్కువ మలంలో మార్పు, మల రక్తస్రావం, నిరంతర కడుపు నొప్పి, బరువు తగ్గడం, బలహీనత లేదా అలసట.
4. నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ పురుషులతో పాటు స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం పొగాకు లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం.
లక్షణాలు : నోటిలో ఎరుపు లేదా తెలుపు పాచెస్, గడ్డలు ఏర్పడడం, పెదవులు లేదా చిగుళ్ల రంగు మారడం, నోటి దుర్వాసన, బలహీనమైన దంతాలు, విపరీతమైన బరువు తగ్గడం.