భారత్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై వర్ష ప్రభావం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ – న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై వర్ష ప్రభావం

June 13, 2019

ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరగాల్సిన భారత్‌ X న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై వర్షప్రభావం నెలకొంది. మ్యాచ్ జరగాల్సిన నాటింగ్‌హామ్‌లో సోమవారం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గ్రౌండ్ చిత్తడిగా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కి కూడా వర్షం అడ్డంకిగా మారింది.

కాగా గురువారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ మొత్తం జరిగే అవకాశం లేదు. ఓవర్లు తగ్గించి మ్యాచ్ కొనసాగించే అవకాశం ఉంది. అది కుదరకపోతే అంపైర్లు మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అలా జరిగితే టీమిండియా కన్నా న్యూజిలాండ్‌కే ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. న్యూజిలాండ్‌ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు మ్యాచ్ రద్దయితే న్యూజిలాండ్ మొత్తంగా ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఆ జట్టు మిగతా ఐదింటిలో మూడు గెలిచినా సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఈనెల 16న జరగబోయే తదుపరి మ్యాచ్‌ భారత్‌కు కీలకం కానుంది.