ప్రపంచకప్‌లో మళ్లీ ఓడిన పాకిస్థాన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచకప్‌లో మళ్లీ ఓడిన పాకిస్థాన్‌

June 13, 2019

world cup Pakistan vs Australia, ICC Cricket World Cup 2019 Match in Taunton Highlights As it Happened.

క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించేలా కనబడ్డ పాక్‌.. విజయానికి దూరంగానే ఆగిపోయింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచులాడిన పాక్‌.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను కష్టతరం చేసుకుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌(111) సూపర్‌ సెంచరీతోపాటు, కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(82) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా ఆసీస్ ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. పాకిస్తాన్ బౌలర్లలో ఆమిర్‌ 5 వికెట్లతో విజృంభించాడు. 308 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వాహబ్‌ రియాజ్‌(45), సర్ఫ్‌రాజ్‌(40), ఇమాముల్‌ హక్‌(53) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. కమిన్స్‌ మూడు, స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.