హెడ్‌ఫోన్స్‌ను 4 ని. కంటే ఎక్కువగా వాడొద్దు..WHO - MicTv.in - Telugu News
mictv telugu

హెడ్‌ఫోన్స్‌ను 4 ని. కంటే ఎక్కువగా వాడొద్దు..WHO

February 21, 2019

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ వలే హెడ్‌ఫోన్స్ కూడా నిత్యావసరాలలో ఒకటిగా మారిపోయింది. సంగీతం వినడానికి, గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి లేదా సినిమా చూడడానికి యువత హెడ్‌ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే హెడ్‌ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి షాకింగ్ వార్త వినిపిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రోజులో నాలుగు నిమిషాలకు మించి ఇయర్‌ ఫోన్స్‌ వినియోగిస్తే ప్రమాదమని వెల్లడించింది. నాలుగు నిమిషాలకు మించి హెడ్‌ఫోన్స్ వినియోగిస్తే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

World health organization warning about headphones

ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని సంగీతం వినేవారిలో చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలిపింది. పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని, అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమని, వినికిడి పరికరాలు వాడడం తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. భారత్‌లో వయసు పెరగడం వలన తలెత్తే వినికిడి సమస్యలకంటే పెద్ద శబ్దాలు వినడం వల్ల వినికిడి సమస్యలబారిన పడుతున్నవారే ఎక్కువమంది ఉంటున్నారని మనదేశానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సంస్థ వెల్లడించింది.