ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టును కూల్చేసిన ఉంపన్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టును కూల్చేసిన ఉంపన్

May 23, 2020

v mvgbn

ప్రళయ భీకర తుపాను ఉంపన్ పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో అల్లకల్లోలం రేపి లక్షలాది మందికి గూడు కరువు చేసింది. దీంతోపాటు ప్రపంచంలోనే అతి పెద్ద మర్రిచెట్టును కూడా కూకటి వేళ్లతో కూల్చేసింది. హౌరాలోని బొటానికల్ గార్డెన్‌లో ఉన్న మహావృక్షం తుపాను ధాటికి కుప్పకూలింది. దీంతోపాటు ఇండియ్ ఆలివ్ జాతికి చెందిన ఓ అరుదైన చెట్టును కూడా నేలకూల్చింది. అలాహాబాద్‌కు చెందిన వృక్షశాస్త్రవేత్త శివకుమార్ ఈ విషయం వెల్లడించారు. హౌరా పార్కులోని మర్రిచెట్టు వయసు 342 ఏళ్లని, కాండం చుట్టుకొలత 15 మీటర్లని ఆయన తెలిపారు. ‘1925లో దీన్ని మూల కాండాన్ని తొలగించారు. తర్వాత బయటి ఊడలతోనే బతుకుతోంది. భారత జాతీయ వృక్షం మర్రిచెట్టే. కాగా ,ఉంపన్ తుపానులో వందమందికిపైగా చనిపోయారు. ప్రధాని మోదీ బెంగాల్కు వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు