ప్రపంచంలోనే అత్యతంత అందమైన నటిగా పేరు పొందిన తార జినా లోల్లో బ్రిగిడా. ఈమె ఇప్పటి నటి కాదు. చాలా పాత కాలం నటి. అయితే ఈమె తర్వాత అంతలా పేరుపొందిన హీరోయిన్ లు లేరు, అందుకే జినా ఇప్పటి వరకూ అందాల నటిగానే ఉండిపోయారు. అయితే ఈ తార ఇక లేరు. 95 ఏళ్ళ బ్రిగిడా అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇటాలియన్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.
1950లలో బ్రిగిడా మోస్ట్ బ్యూటిఫుల్ వుమన్ ఇన్ ది వరల్డ్ గా పేరు గాంచారు. బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ అనే సినిమాలో తన పాత్రకు బాగా పేరు వచ్చింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో లాంటి నటులతో ఈమె 60 కి పైగా సినిమాల్లో నటించారు.1960 తర్వాత రాజకీయాల్లోకి కూడా వెళ్ళారు బ్రగిడా. అయితే దీనివల్ల ఈమె యాక్టింగ్ కెరీర్ ఆగిపోయింది. 1927వ సంవత్సరంలో పుట్టిన ఈమె చదువు 20 ఏళ్ళ వయసులో యదువు కోసం రోమ్ వెళ్ళారు. బ్రిగిడా బోలెడు అవార్డులను సైతం గెలుచుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు బ్రిగిడా మరణానికి సంతాపం తెలిపారు.