World Most Expensive Drug Approved to Treat Hemophilia at $3.5 Million a Dose
mictv telugu

అత్యంత ఖరీదైన మెడిసిన్.. ధర 28.6 కోట్లు

November 24, 2022

కొన్ని జబ్బుల చికిత్సకు వాడే మందులు చాలా ఖరీదని మనకు తెలుసు. లక్షలు, కోట్లలోనే ఉంటుంది ధర. ప్రాణాంతక వ్యాధులకు వాడే అలాంటి మందుల తయారీ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకోవడమే అందుకు కారణం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం మార్కెట్లోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఎల్ బెహ్రింగ్, యూనిక్యూర్ కంపెనీలు ‘హెమ్‌జెనిక్స్’ పేరుతో దీన్ని విడుదల చేశాయి. రక్తం గడ్డకట్టడం వల్ల తలెత్తే ‘హిమోఫిలియా బి’ వ్యాధి చికిత్సకు ఈ మందు వాడుతున్నారు. దీని ధర 3.5 మిలియన్ డాలర్లు(రూ. 28.6 కోట్లు). జన్యుమార్పిడి చేసిన వైరస్ సాయంతో ఈ మందు తయారు చేశారు.

హిమోఫిలియా ప్రతి 40వేల మందిలో ఒకరి ఉంది. కాలేయంలో ఫ్యాక్టర్9(IX) ప్రొటీన్ అనే ప్రొటీన్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కొత్త ఔషధంలోని జన్యుమార్పుడి ద్వారా తయారైన వైరస్ కాలేయంలో ఫ్యాక్టర్ 9 లోపాలన్ని నివారిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఔషధాన్ని ప్రయోగపూర్వకంగా పరీక్షించిన తర్వాత సంతృప్తికర ఫలితాలు రావడంతో అమెరికా కూడా దీనికి అనుమతినిచ్చింది.