ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు.. ధర 7,308 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు.. ధర 7,308 కోట్లు

April 24, 2018

కాస్త పెద్ద ఇంటిని చూస్తేనే లంకంత ఇల్లు అని ఆశ్చర్యపోతుంటాం. ప్రపంచంలో పెద్దపెద్ద ఇళ్లు చాలానే ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఎక్కడుతోందో తెలుసా? ఫ్రాన్స్‌లోని నీస్ నగరానికి సమీపంలో ఉన్న సెయింట్ జీన్ కాప్ ఫెరాట్ పట్టణంలో. దీని వెల అక్షరాలా రూ. 7,308 కోట్లు(1.1 బిలియన్ డాలర్లు). దీన్ని తాజాగా అమ్మకానికి పెట్టారు.

విలా లె సెడర్ అనే పేరున్న ఈ భవనాన్ని 1830లో నిర్మించారు. బెల్జియర్ రాజు రెండో లియోపాల్డ్ అప్పట్లో ఇందులో కాపురం చేశాడు. ఇందులో 10 పడగ్గదులు ఉన్నాయి. ఒలింపిక్ ఈత పోటీలు జరిగే స్విమ్మింగ్ పూల్ సైజంత పూల్ ఉంది. ఇంత పెద్ద కొంపలో ఉండడం తమ వల్ల కావడం లేదని, చిన్న ఇల్లు చూసుకుంటున్నామని, అందుకే అమ్మకానికి పెట్టామని యజమాని సుజానఏ లాపోస్టోల్ చెప్పింది. 35 ఎకరాల లాన్లు, 30 గుర్రాలు, బగ్గీలు నానా సదుపాయాలు ఉన్న ఈ ఇంటిని ఎవరు కొంటారో చూడాలి మరి.