22 యేండ్లు బతికిన కుక్క గిన్నీస్ బుక్‌లో చోటు! - MicTv.in - Telugu News
mictv telugu

22 యేండ్లు బతికిన కుక్క గిన్నీస్ బుక్‌లో చోటు!

November 25, 2022

గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ల్లో జినో వోల్ఫ్ చోటు సంపాదించుకున్నది. అతి ఎక్కువ యేండ్లు బతికిన కుక్కగా రికార్డు నెలకొల్పింది. మామూలుగా కుక్కలు 8‌‌_ 15 సంవత్సరాలు బతుకుతాయి. కొన్ని 20 సంవత్సరాలు బతుకుతుంటాయి. అంతకుమించి బతకడం అంటే అది రికార్డే! గినో వోల్ఫ్ అనే కుక్క 22 సంవత్సరాలు బతికి ఇప్పుడ రికార్డుల్లోకి ఎక్కింది. 24 సెప్టెంబర్ 2000 న గినో జన్మించింది. ఈ కుక్కని నవంబర్ 15, 2002లో కొలరాడోకి చెందిన అలెక్స్ వోల్ఫ్ ఈ కుక్కని దత్తత తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి దాని పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాడు.

‘గినోని నేను చాలా సంవత్సరాలుగా సాకుతున్నా. ఎంతో చక్కగా చూసుకుంటున్నా. నాకు అది ఎప్పుడూ షాక్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అంతేకాదు.. గినో చాలా ఆరోగ్యంగా ఉండడానికి దాని డైట్ కారణం. రోజు కచ్చితంగా సరైన నిద్రపోతుంది. మధ్యమధ్య చిన్న చిన్న కునుకు తీస్తుంది. సాల్మన్ స్నాక్స్ తింటుంది. కానీ వృద్ధాప్యం కారణంగా కండ్లు సరిగా కనపడకపోవడంతో అది పూర్తి శాఖాహారిగా మారిపోయింది. గినో చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. మా ఇంటి వెనుక ప్రాంతం మొత్తం కలియ తిరిగేది. నా తల్లిదండ్రులు మాన్హట్టన్ బీచ్ తీసుకెళ్లేవారు. అది అక్కడ బాగా ఎంజాయ్ చేయడం నేను చూశాను. గినోకి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ బాగా వింటుంది. కారులో విండో పక్కన కూర్చొని సంగీతం ఆస్వాదించడం గినోకి చాలా ఇష్టం’ అంటున్నాడు అలెక్స్.
ఇంతకుముందు ఈ రికార్డు పెబిల్స్ అనే కుక్క మీద ఉండేది. 3 అక్టోబర్ 2022న మామూలు ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇది చనిపోయింది. ఇప్పుడు ఆ పేరును గినో తిరగరాసింది.