వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు ! - MicTv.in - Telugu News
mictv telugu

వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు !

August 19, 2017

మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. ఫోటో జీవిత సత్యాలను కళ్ళకు కడుతుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. ఒక్క ఫోటో ప్రభుత్వాల్లో, అధికారుల్లో కూడా చలనం తెస్తుంది. అందుకే దానికంటూ ఒక స్పెషల్ డే వుండటం అనేది కంపల్సరియే. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరపున ఫోటోగ్రఫీ పోటీ నిర్వహించారు.

 

 రవీంద్రభారతిలో  శనివారం ఉదయం 11 గంటలకు  బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత, తెలంగాణ మీడియా చైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, భాషా సంసృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారని  తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. భాస్కర్  తెలిపారు.

ఫోటోలు బడుగు, బలహీన వర్గాల వెతలను, పాలకుల పాపాలను, ఉన్నత వర్గాల తీరును, ప్రకృతి రమణీయతలను, మనుషుల భావాలను  చూపగలవని కూడా అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఫోటో జర్నలిస్టులందరికీ ‘ మైక్ టీవీ’ అభినందనలు తెలియజేస్తోంది.