ప్రపంచంలోనే అత్యంత చిన్నకంప్యూటర్.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అత్యంత చిన్నకంప్యూటర్..

March 21, 2018

ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించింది. వడ్లగింజంత కూడా లేని ఈ బుల్లి కంప్యూటర్లో 10 లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. X86 చిప్ ఉంది.దీని తయారీ ఖర్చు కూడా పది సెంట్లకంటే (64 పైసలు)తక్కువే. ఈ నెల 19న ప్రారంభమైన ఐబీఎం థింక్ 2018 కాన్ఫరెన్సులో దీన్ని ఆవిష్కరించారు.

దీన్ని బాగా చూడాలంటే మైక్రోస్కోప్ అవసరం. ఇందులో మానిటరింగ్, అనలైజింగ్, కమ్యూనికేటింగ్, డాటా యాక్టింగ్ తదితర ఫీచర్లు ఉన్నారు. మెమరీ కోసం ఎస్ ర్యామ్‌ను జోడించారు. పవర్ కోసం ఫోటో వోల్టాయిక్ సెల్‌ను అమర్చారు. ఎల్ఈడీ, ఫోటో డిటెక్టర్ సాయంతో అప్ లింక్, డౌన్ లింక్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.