పిలవకపోతే నాకేం పోయె..! - MicTv.in - Telugu News
mictv telugu

పిలవకపోతే నాకేం పోయె..!

December 16, 2017

హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించకపోవడంపై మీడియాలో ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. ఆయనను పిలిస్తే.. అనవసర రాద్ధాంతం అవుతుందని, ఆంధ్రాప్రాంత రచయితల ప్రస్తావనతో గొడవ అవుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.అయితే చంద్రబాబు మాత్రం దీన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఈ తెలుగు మహాసభలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై ఆయన స్పందించారు. ‘నన్ను పిలవకపోయినా ఏం ఫర్వాలేదు.. తెలుగు భాషను అందరూ గౌరవించాలి.. తెలుగు భాషను కాపాడుకునేందుకు, ప్రచారం చేసేందుకు జరిపే  ఏ కార్యక్రమానికైనా టీడీపీ మద్దతు ఇస్తుంది. తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలన్నదే నా  అభిమతం’ అని ఆయన అన్నారు. మహాసభలు శుక్రవారం ప్రారంభం కావడం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్, వందలాది రచయితలు పాల్గొన్నారు.