ప్రపంచంలోనే ఖరీదైన టీపాట్.. జస్ట్ 20 కోట్లే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే ఖరీదైన టీపాట్.. జస్ట్ 20 కోట్లే..

April 21, 2018

ధనికుల అభిరుచుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదిముట్టుకున్నా ఖరీదైనదే అయి వుండాలన్నది వారి సిద్ధాంతం. అలాంటి వారికోసమే తయారైంది ఈ టీపాట్. 1658 వజ్రాలు, 6.67 క్యారట్ల బరువుతున్న ఒక రూబీ, 386 చిన్నచిన్ని రూబీలు, బంగారం ట్రిమ్‌తో దీన్ని తయారు చేశారు. వెల రూ,. 20 కోట్లు. పేరు ఈగోయిస్ట్.

డిజైనర్ నిర్మల్ సెతియా దీన్ని తయారు చేశారు. యువజన కార్యక్రమాలు, వైద్యపరిశోధనలు, ప్రకృతి విపత్తుల్లో సాయం కోసం ఏర్పాటు చేసిన ఎన్సెతియా ఫౌండేషన్ కు దీన్న అందించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ టీపాట్‌ను లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు.