ప్రపంచ రికార్డ్.. తొలి విద్యుత్ విమానం ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచ రికార్డ్.. తొలి విద్యుత్ విమానం ఇదే

December 12, 2019

Aircraft02

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలతో మేధావులు ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ప్రపంచంలో మొట్టమొదటి విద్యుత్ విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. ఎలాంటి ఇంధనం లేకుండా పూర్తి విద్యుత్‌శ్చక్తితో పనిచేస్తుంది. ఈ ఎయిర్ బస్ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ కరెంట్ విమానాలు మరో రెండేళ్లలో ప్రయాణికులను చేరవేసేందుకు ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.  

కెనడాకు చెందిన మ్యాగ్ని ఎక్స్ సంస్థ దీన్ని తయారు చేసింది. వాంకోవర్​లోని హార్బర్​ ఎయిర్​ అనే సంస్థ కోసం దీన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతోనే దీన్ని తయారు చేసినట్టు మ్యాగ్ని ఎక్స్​ సీఈవో రోయి గాంజార్స్కీ చెప్పారు.ఇది ఎలక్ట్రిక్​ ఏవియేషన్​ యుగానికి ప్రారంభమని ఆయన వ్యాఖ్యానించారు. ఆరుగురు ప్రయాణించే డీహెచ్​సీ 2 డీఈ తో ఈ​ విమానానికి రూపునిచ్చారు. వాంకోవర్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుకు సమీపంలోని ఫ్రేజర్​ నదిలో టెస్ట్​ రైడ్ నిర్వహించారు. 15 నిమిషాలు పరీక్షించిన తర్వాత ఇది విజయవంతంగా పనిచేస్తుందని నిర్థారణకు వచ్చారు. మొత్తానికి తాజా ఆవిష్కరణతో త్వరలోనే ఎలక్ట్రిక్ విమానాలు రాబోతున్నాయి.