World's first ever real time gold ATM launched in Hyderabad
mictv telugu

ప్రపంచంలోని మొట్టమొదటి బంగారం ఎటీఎం!

December 6, 2022

World's first ever real time gold ATM launched in Hyderabad

డబ్బుల కోసం ఎటీఎంలో క్యూలో నిలబడేవాళ్లు. ఇప్పుడు బంగారం కూడా ఎటీఎంలో డ్రా చేసుకోవచ్చు. మీరు విన్నది నిజం! ప్రపంచంలోనే మొదటి గోల్డ్ ఎటీఎం ఇప్పుడు హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఒకప్పుడు బ్యాంక్ కి వెళ్లడం.. స్లిప్పులు నింపి కౌంటర్ లో నిలబడడం చేసేవారు. ఈ ఇబ్బందులు తగ్గాలని ఏటీఎంలను తీసుకొచ్చారు. ప్రస్తుతం యూపీఐ యాప్స్ రాకతో ఏటీఎంల సందర్శకులు తగ్గారు. కానీ ఎటీఎంలను వాడేవాళ్లు లేకపోలేదు. డబ్బులే కాదు బంగారాన్ని ఎటీఎం ద్వారా అందించాలనే ఆలోచనతో గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆలోచించింది. ‘మేం గోల్డ్ ఎటీఎంను విజయవంతంగా ప్రారంభించాం. ఈ విజయం బంగారు తెలంగాణ మిషన్ కు దోహదపడుతుందని అనుకుంటున్నాం.

మేం తిరుగులేని ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం’ అని గోల్డ్ సిక్కా సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. డిసెంబర్ 3న హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ M/s OpenCube Technologies Pvt Ltd నుంచి టెక్నాలజీ సపోర్ట్ తో దీన్ని ప్రారంభించింది. ‘కొంచెం పరిశోధన చేసిన తర్వాత అది సాధ్యమేనని మేం కనుగొన్నాం. ఒక స్టార్టప్ కంపెనీ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ తో టై అప్ అయ్యాం. వారు సాంకేతికతకు సంబంధించిన డిజైన్, డెవలప్మెంట్ సపోర్ట్ అందించిన మా అంతర్గత విభాగం ఉంది’ అని గోల్డ్ సిక్కాకు చెందిన ప్రతాప్ అంటున్నారు.

మామూలు ఎటీఎంలా లాగే ఇవీ పని చేస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సహాయంతో గోల్డ్ సిక్కాలను కొనుక్కోవచ్చు. ఈ ఎటీఎం నిల్వ సామర్థ్యం 5కిలోల బంగారం, దాదాపు 2 నుంచి 3 కోట్ల బంగారం ఈ ఎటీఎంలో ఉంటుంది. 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా., 20 గ్రా., 50 గ్రా., 100 గ్రా. లుగా ఈ ఎటీఎం ద్వారా పొందవచ్చు. దీనివల్ల నిమిషాల్లో బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది గోల్డ్ సిక్కా. ఈ నాణెలు 24 క్యారెట్స్ బంగారమే. లండన్ బులియన్ మార్కెట్ ప్రకారం బంగారం ధర ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. దాని ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేయాలి. అంతేకాదు ఈ ఎటీఎం పటిష్టమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. దీంట్లో అంతర్నిర్మిత కెమెరా, సౌండ్ అలారం కలిగి ఉంటుంది. ఎవరైనా ట్యాంపర్ చేయాలని ప్రయత్నిస్తే అది ట్రిగ్గర్ అవుతుంది. బయట కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇవి స్థానిక పోలీస్ స్టేషన్ కి అనుసంధానించబడి ఉన్నాయని గోల్డ్ సిక్కా యాజమాన్యం చెబుతున్నది.

ఒక్కసారి బంగారాన్ని డెబిట్ చేయకపోతే 24గంటల్లో ప్రజలు డబ్బులను తిరిగి పొందుతారని గోల్డ్ సిక్కా స్పష్టం చేసింది. మొదటి ఎటీఎం బేగంపేటలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది. ఈ రోజు వరకు సుమారు 20మంది వ్యక్తులు ఈ ఎటీఎం ద్వారా బంగారాన్ని పొందారు. హైదరాబాద్ విమానాశ్రయం, పాతబస్తీ, అమీర్ పేట, కూకట్ పల్లి ఏరియాల్లో 3 నుంచి 4 మెషీన్స్ ఇన్ స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తున్నది. దేశవ్యాప్తంగా దాదాపు 3వేల ఎటీఎంలను ఏర్పాటు చేయాలని కంపెనీ ఆలోచిస్తున్నది.