సైన్స్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఎన్నో వ్యాధులకు మందులు కనిపెడుతున్నారు. కొన్ని పరిశోధనలు ఆలస్యం అవుతున్నా ప్రయోగాలు మాత్రం నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ వీర్యం తయారైంది. అమెరికాలోని శాన్ డీయాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఈ ఘనత సాధించారు. లేబొరేటరీలో కృత్రిమ వీర్యాన్ని విజయవంతంగా తయారు చేశారు. దీంతో పురుషుల్యో సంతాన సమస్యకు మార్గం సుగమమైంది.
ప్రపంచంలోని ప్రతి ఏడుగురు పురుషుల్లో ఒకరు సంతాన సమస్య ఎదుర్కొంటున్నారు. వీర్యం నాణ్యత లేకపోవడం ఇందులో కీలకం. ఫలదీకరణానికి అవరసమైన నాణ్యత దిశగా శుక్రకణాలపై పరిశోధనలు సాగుతున్నాయి. శాన్ డీయాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు మూలకణాలో పరిశోధనలు నిర్వహించారు. వీర్యమూల కణాలు టెస్ట్ ట్యూబులో ఉంచి, వాటిని పూర్తిస్థాయి వీర్యకణాలుగా అభివృద్ధి చేశారు. ఇది విప్లవాత్మక విజయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘కొన్ని క్షణాలోనే వెయ్యికిపైగా వీర్యకణాలను తయారు చేశాం. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ అనాసిస్తోపాటు పలు శాస్త్రవిధానాల్లో ప్రయోగాలు నిర్వహించాం. కృత్రిమ వీర్యకణాల ద్వారా భవిష్యత్తులో ఎన్నో అద్భాతాలు జరుగుతాయి..’ అని పరిశోధకులు చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాలను పీఎన్ఏఎస్ పత్రికలో ప్రచురించారు.