టూవీలర్ నడపాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ దానంతట అదే బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా ఉంటంది. టూవీలర్ నడిపించేందుకు చాలా ఈజీగా ఉంటుంది కదూ. అవును మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే అలాంటి తొలి సెల్ఫ్ బ్యాలెన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేస్తోంది ముంబై కి చెందిన లైగర్ మొబిలిటీ. అంతేకాదు ఈ స్కూటర్ ఫీచర్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ ఈ స్కూటర్ లో ఉంటుంది. త్వరలో జరగనున్న ఆటో ఎక్స్ పో 2023లో ఈ స్కూటర్ ను ప్రదర్శించున్నట్లు సమాచారం. 2019లో ఈ స్కూటర్ గురించి ప్రకటించినప్పటికీ…ఇప్పుడు పూర్తయ్యి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడానికి ముందు స్కూటర్ కు సంబంధించిన ఫొటోలు బయటకు లీక్ అయ్యాయి.
ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్లతో రెట్రో స్టైలింగ్‌ను మిళితం చేస్తుంది. చూడటానికి అచ్చం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, వెస్పాలా కనిపిస్తుంది. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విశాలమైన సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ తో వస్తుంది. అలాయ్ వీల్స్‌తోపాటు ముందు డిస్క్ బ్రేక్, బ్యాక్ చక్రానికి డ్రమ్ బ్రేక్ కూడా ఉంటుంది. దేశీయ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ స్కూటర్లో చూస్తారని తయారీదారు సంస్థ లైగర్ మొబిలిటీ చెబుతోంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ వల్ల నడిపే వారికి సెఫ్టీ, బెస్ట్ రైడింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.