Worlds first smart street which generates electricity from footsteps
mictv telugu

ఈ వీధిలో నడువండి.. కరెంట్ను పుట్టించండి!

November 19, 2022

సోలార్, విండ్, వాటర్.. ఇలా కరెంట్ పుట్టించడానికి ఎన్నెన్నో మార్గాలను కనిపెట్టారు. కానీ ఇప్పుడ మీ నడకే కరెంట్కి ఇంధనం. యూకేలో మొదలైన ఒక స్మార్ట్ స్ట్రీట్ గురించే ఈ కథనం..
కరెంట్ ఎలా పుడుతుంది అనే విషయం పక్కన పెడితే.. ఎలాగైనా విద్యత్తును ఉత్పత్తి చేయొచ్చని నిరూపిస్తున్నారు పరిశోధకులు. అలా అనుకొని ఒక కంపెనీ తక్కువ వనరులతో విద్యత్తును ఉత్పత్తి చేయాలనుకుంది. అయితే ఇందులో ప్రజల ఆరోగ్యం, ఇతర అవసరాలను కూడా దృష్టిలో ఉంచాలనుకుందో కంపెనీ. యూకేకి చెందిన పావెజెన్ అనే కంపెనీ లండన్లో ఒక వీధిని నిర్మించింది. 107 స్క్వేర్ ఫీట్ల మేర ఈ వీధిని నిర్మించారు. దీని మీద నడిస్తే మన అడుగులే కరెంట్ని ఉద్భవించేలా చేస్తాయి. అంతేకాదు.. నడుస్తున్నప్పుడు మీరు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేశారనేది కూడా తెలుసుకోవచ్చు.

ఒక యాప్ వేసుకుంటే అది బ్లూటూత్ ద్వారా మీకు వివరాలన్ని తెలియచేస్తుంది. అంతేకాదు.. మీరు ఎక్కువ నడిస్తే ఆ కంపెనీ కొన్ని రివార్డులను కూడా పంపిస్తుందట. ఇంతకుముందు ఈ వీధిలో ట్రాఫిక్ మోత ఎక్కువ ఉండేది. అది తగ్గించేందుకు ఈ విధమైన ఏర్పాటు చేసిందా కంపెనీ. అంతేకాదు.. ఈ స్మార్ట్ స్ట్రీట్ నుంచి పక్షుల శబ్దాలు, వీధి దీపాలు వెలిగే ఏర్పాట్లు కూడా త్వరలోనే చేస్తున్నారు. మరికొన్ని బిజీ వీధులను కూడా సెలెక్ట్ చేసి ఇలా చేస్తే రణగొణ ధ్వని తగ్గడం ఖాయమంటున్నదీ కంపెనీ. ఈ వీధిలో వేసిన టైల్స్ రబ్బర్, స్టయిన్లెస్ స్టీల్తో తయారయ్యాయి. వీటిని త్వరలోనే దుబాయ్, మిలాన్, హాంకాంగ్లో కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

మరో కంపెనీకి కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఇలాంటి ఒక పేవ్మెంట్ని టెలీఫోర్డ్ షోపోషయర్ తయారు చేసింది. వీళ్లు ఈ టైల్స్ని సెంట్రల్ ట్రెయిన్ స్టేషనలో ఏర్పాటు చేశారు. పైగా అక్కడ స్క్రీన్ ద్వారా కూడా మీరు ఆ రోజు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేశారో తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం 4మిలియన్ పౌండ్లను వెచ్చించారు. గంటకు 2.1వాట్ల కరెంట్ను ఈ పేవ్మెంట్ ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్తో ఫోన్లు, ఇతర డివైజ్లు కూడా చార్జ్ అవుతాయి. చూస్తుంటే ప్రతీ చిన్నకదలికతోనూ కరెంట్ పుట్టించేలా ఉన్నారు.