కాస్త ఎండ కాస్తే ఇంట్లోకి కరెంట్ వస్తుంది. దానికి మనం సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కారు కూడా సౌర ఇంధనంతో నడిచేస్తుంది. త్వరలోనే మన ముందుకు రాబోతున్న కారు
గురించి ఈ వివరాలు..
ఉత్పత్తిలోకి ప్రవేశించిన మొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారును లైట్ ఇయర్ 0 అని పిలుస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టార్టప్ ఫిన్ లాండ్ వాల్మెట్ ఆటోమోటివ్ కు ఉత్పత్తి యాజమాన్యాన్ని ఇచ్చింది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన వాహన తయారీదారులు తమ వాహనాలను సౌర ఉత్పత్తితో నడిచేలా చేయడానికి సిద్ధమవుతున్నారు. వాల్మెట్ భాగస్వామిగా CATL సహాయంతో లైట్ ఇయర్ వంటి స్టార్టప్ లకు పూర్తి బ్యాటరీ, వాహనాల తయారీ పరిష్కారాలను అందించాలనుకుంటున్నది.
సెకన్లలో..
సోలార్ కారు రూపకల్పన చేసేటప్పుడు సమర్థత పరిగణనలోకి తీసుకోబడింది. దీని బాడీ 0.175కంటే తక్కువ డ్రాగ్ కో ఎఫీషియంట్ తో చాలా స్లీక్ గా ఉంటుంది. ఉత్పాదక కారుల్లో ఇది అత్యంత తక్కువ. అదనంగా పై కప్పు, బోనెట్ తో సహా దాని బాడీ ప్యానెల్ ల పై సోలార్ ప్యానెల్ లు అమర్చబడ్డాయి. ఎండ కొడితే ప్రతిరోజూ బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. నెలరోజుల పాటు రోజుకు 50కి.మీ. డ్రైవ్ చేస్తే మీరు ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. నాలుగు వేర్వేరు ఇన్ వీల్ మోటర్లు, 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ లైట్ ఇయర్ 0తో చేర్చబడ్డాయి. ఇది కేవలం పది సెకన్లలో గంటలకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగంతో నడుస్తుంది. గరిష్టంగా గంటకు 160 కి.మీల వరకు నడుపవచ్చు. ఇందులో అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీ ప్యాక్ కూడా చేర్చబడింది.
ఖర్చు కాస్త ఎక్కువ..
లైట్ ఇయర్ 0 కొనుగోలు 2,62,00 డాలర్లు ఖర్చవుతుంది. అంటే.. సుమారు 2.16 కోట్ల రూపాయలు అన్నమాట. ఎండ ప్రాంతంలో నివసించే వారికి చాలా డబ్బు ఆదా చేయగలదు. ఎందుకంటే మితమైన రోజువారీ ఉపయోగం కోసం బ్యాటరీ తగినంతంగా ఛార్జ్ చేస్తే చాలు. కొన్ని సంవత్సరాల్లో లైట్ ఇయర్ 2 పేరుతో ఒక చిన్న ఈవీ ని విడుదల చేస్తుంది. 946 యూనిట్లు ఉన్న లైట్ ఇయర్ 0 ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉంది.