ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రం.. హైదరాబాద్ పక్కనే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రం.. హైదరాబాద్ పక్కనే

January 27, 2020

Meditation Center.

హైదరాబాద్‌ మరో అద్భుత కట్టడానికి వేదిక కానుంది. హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లే దారిలో గల చేగూరు గ్రామంలోని కన్హా శాంతి వనంలో నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా ఇది నగరవాసులకు రేపటినుంచి అందుబాటులోకి రానుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో లక్షమంది ఒకే చోట ధ్యానం చేసేందుక వీలుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. హార్ట్‌ ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. 

సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యోగా కేంద్రం ఐకానిక్‌ డిజైన్‌గానూ చరిత్రకెక్కనుంది. ఈ యోగా కేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గ్లోబల్‌గైడ్‌ దాజి రేపు ప్రజలకు అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ పాల్గొననున్నారు. తాబేలు ఆకారంలో ఈ యోగా కేంద్రాన్ని నిర్మించడం విశేషం. చాలా మందిని ఈ కేంద్రం ఆకట్టుకుంటోంది. రాత్రి వేళల్లో విద్యుత్‌ వెలుగుల మధ్య కాంతులీనుతోంది. ఆరోగ్యం, ఆహ్లాదం కోరుకునేవారికి ఈ యోగా కేంద్రం మంచి వెసలుబాటును ఇవ్వనుంది.