ఔరా చైనా! ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెన రెడీ - MicTv.in - Telugu News
mictv telugu

ఔరా చైనా! ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెన రెడీ

October 20, 2018

ఇక భవిష్యత్తు, చరిత్ర, రికార్డులు, విజయాలు అన్నీ తూర్పు దేశాలవే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని భారత్ ఈ నెల 31న ఆవిష్కరించనున్న నేపథ్యంలో చైనా కూడా మరో రికార్డుకు వేదికైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవవైన సముద్ర వంతెను పూర్తి చేసి ఈ నెల 24 ప్రారంభించింది. దీంతో రెండు ప్రపంచ అద్భుతాలకు ఆసియాలోని పక్కపక్క దేశాలు నిలయాలు కానున్నాయి.

అంతా సముద్రంలోనే..

చైనా ఇటీవల భారీ నిర్మాణాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. మౌలిక వసతుల కల్పనలో భాగంగా చైనా- హాంకాంగ్‌-మకావులను కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మించింది. ఇది ఆరు లైన్ల రహదారి. 2009 డిసెంబరు నుంచి పనులు మొదలయ్యాయి. అన్ని పరీక్షలు నిర్వహించి వంతెన పక్కగా ఉందని తేల్చారు. ఈ వంతెన వల్ల  హాంకాంగ్‌, జుహాయ్‌ల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. ప్రస్తుతం మూడు గంటల సమయం పడుతుండగా, వంతెన రాకతో కేవలం అరగంటలో అట్నుంచి ఇటువైపు, ఇట్నుంచి అటువైపు చేరుకోవచ్చు. రోజూ 30 వేల వాహనాలు వెళ్తొచ్చు. 120 ఏళ్లపాటు ఢోకా లేకుండా వాడుకోవచ్చు.

trt

నిర్మాణం ఇలా..

వందలాది ఇంజినీర్లు, వేలమంది కార్మికులు కష్టపడ్డారు. 60 ఈఫిల్‌ టవర్ల నిర్మాణానికి అవసరమయ్యే ఉక్కును వాడారు. ఇది సరళరేఖలాంటి వంతెకాదు. మలుపులు, జంక్షన్లు ఉంటాయి. దీని కోసం సముద్రాన్నే తవ్వాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం, ఇతర పర్యాటక హంగులను కూడా తీర్చిదిద్దారు. దీని నిర్మాణానికి రూ. 11 వేల కోట్లు ఖర్చయిందని అంచనా. అయితే ఇది పైకి చెబుతున్న లెక్క అని, రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. చైనా పూర్తి వివరాలు ఎప్పుడూ వెల్లడించదని, ఈ ప్రాజెక్టుపై ప్రతిఫలం ఆశించకుండా సౌకర్యంతోపాటు ఆధిపత్యం, ప్రతిష్ట కోసం నిర్మించారని చెబుతున్నారు. దీని నిర్మాణంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని, అవినీతి జరిగిందని వార్తలు వచ్చాయి.

445