World's longest skywalk with glass top be made in India
mictv telugu

పొడవైన గ్లాస్ స్కైవాక్ ఇండియాలో!

December 27, 2022

SkywaSkywalk, glass top, india, first, longestlk, glass top, india, first, longest

ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ నిర్మాణం జరుగుతున్నది. 407 మీటర్ల పొడవైన స్కైవాక్ ను మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోని చిఖల్దారా అనే హిల్ స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. కొండ పై నుంచి కింద లోయను పై నుంచి చూస్తే కళ్లు తిరుగుతాయి. అలాంది రెండు కొండల మధ్య ఒక వంతెన నిర్మాణం చేస్తున్నారు. అది కూడా అద్దాలతో. ఈ అద్దాల వంతెన నుంచి దాటాలంటే గుండె ధైర్యం కాస్త ఎక్కువ ఉండాల్సిందే! ఇలాంటి గాజు వంతెనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇంత పొడవైన వంతెనని ఎక్కడా చూడలేదు, ఇప్పటివరకు నిర్మాణం జరుగలేదు. కానీ త్వరలోనే పూర్తయి దాని మీద నడిచే అవకాశం రాబోతున్నది.

మొట్టమొదటి..

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. సిక్కిం తర్వాత భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్న గ్లాస్ వాక్ (స్కై వాక్) స్విట్జర్లాండ్ లోని స్కైవాక్ కంటే పొడవుగా ఉంటుంది. దీని పొడవు 397 మీటర్లు, చైనాలో 360 మీటర్లు. అదే మహారాష్ట్రలోని స్కైవాక్ పొడవు 407 మీటర్లు. ఇందులో మధ్యలో 100 మీటర్ల గ్లాస్ డెక్ ఉన్న స్కైవాక్ జూలై 2023 నాటికి సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్ కేబుల్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన చిఖల్ దరా స్కైవాక్ కు రూ. 35 కోట్లు ఖర్చవుతుంది. జనవరి 2022లో రాష్ట్ర అటవీ శాఖ చిఖల్దరా స్కైవాక్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చింది. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.

చిఖల్దారా స్కైవాక్ ప్రాజెక్ట్ మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, పెద్ద పెద్ద చెట్లు, జంతుజాలం ఈ స్కైవాక్ పై మరింత ఆసక్తిగా ఉండబోతున్నది. చిఖల్దారా స్కైవాక్ ప్రాజెక్ట్ మెల్ఘాట్ లో 900 జాతుల మొక్కలు, 35 జాతుల జంతువులు, 295 జాతుల పక్షులకు నిలయం. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ చిఖల్దారా. ఇది ముంబై – నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేకి దగ్గరగా ఉంది. ఈ ప్రాజెక్ట్ 70శాతం పూర్తయింది.

ఇవి కూడా చదవండి : 

భారతీయ వంటకాలు 5వ స్థానంలో..

102 మంది సంతానం తర్వాత వృద్ధుడి కీలక నిర్ణయం

కన్నతల్లి కడసారి కోరిక.. ఐసీయూ వార్డులోనే కూతురి పెళ్లి..