ఈ కుడుము ఖరీదు అక్షరాలా రూ. 36,000 - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కుడుము ఖరీదు అక్షరాలా రూ. 36,000

May 16, 2019

ఈ కుడుమేంటి? నీలి రంగులో ఉందని అనుమానంగా చూడకండి. నీలిచిత్రాలకు, వయాగ్రా లాంటి బ్లూ చీకటి వ్యవహారాలకు దీనితో ఏమాత్రం సంబంధం లేదు. జస్ట్, రుచి కోసమే ఆ రంగు. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు ఎవరి రుచి వాళ్లది.

వినాయకచవితికి మనం నానా రకాల కుడుములు చేసుకుంటాం కదా. కొందరు లోపల పూర్ణం పెడతారు. ఇటీవల డ్రైఫ్రూట్స్ పెడుతున్నారు. మనమంటే ఇలా ఏదో పండగల కోసం చేసుకుంటాంగాని, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో అవి నిత్యం ఉండాల్సిందే. ఇక ఈ నీలి కుడుము సంగతేంటో చూద్దాం. జర్మనీలోని యంబా కంపెనీ వీటిని అమ్ముతోంది. ఒక్కోదాని ధర రూ. 36 వేలు. దీని పేరు బ్లూ డైమండ్ డిమ్ సిమ్. చైనా కంపెనీ హాంగ్మీ జాంగ్ యాంబా అసలు ఓనర్.

ఎందుకంత?

ఏదో ప్రత్యేకత ఉంటుది కదా. ఇందులో పట్టుపురుగు ఫంగస్, కుంకుమపువ్వు, బ్లూబెర్రీ పౌడర్, బోలెటస్ రకం పుట్టగొడుగుల తరుగు, సిల్కీ జాతి కోడి మాంసం గట్రాలను పల్చని నీలిరంగు పిండి రేకులో కూరుతారు. తర్వాత ఆవిరిపై ఉడికిస్తారు