World’s most powerful passports in 2023 Know India’s rank here
mictv telugu

శక్తివంతమైన పాస్ పోర్స్ట్ ఏవి?!

January 11, 2023


అత్యధిక వీసా రహిత స్కోర్ ఉన్న దేశం అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ను కలిగి ఉంది. ఇందులో మన దేశం ఎక్కడ ఉంది? ఏ ఏ దేశాలు ఏ ఏ స్థానాలో ఉన్నాయో చూడండి.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా లండన్ కు చెందిన గ్లోబల్ సిటిజన్షిప్ రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ 2023 సంవత్సరానికి ఒక ఇండెక్స్ ను విడుదల చేసింది.

ఇండెక్స్ స్కోరింగ్ సిస్టమ్ అంటే..
ఇండెక్స్ స్కోరింగ్ సిస్టమ్ వినియోగదారులకు వారి పాస్ పోర్ట్ శక్తి నమ్మకమైన అవలోకనాన్ని అందించడానికి అభివృద్ధి చేయబడింది. ప్రతి పాస్ పోర్ట్ హోల్డర్ వీసా రహితంగా యాక్సెస్ చేయగల మొత్తం గమ్యస్థానాల సంఖ్య పై స్కోర్ చేయబడుతుంది. హెన్లీ పాస్ పోర్ట్ స్కోర్ ల ప్రకారం.. ప్రపంచంలోని 6శాతం దేశాలు మాత్రమే గ్లోబల్ ఎకానమీలో 70శాతానికి పైగా ప్రయాణికులకు యాక్సెస్ ఇస్తున్నాయి. కేవలం.. 17 శాతం దేశాలు మాత్రమే ప్రపంచంలోని 227 గమ్యస్థానాల్లో నాలుగైదు వంతుల కంటే ఎక్కువ వీసా రహిత యాక్సెస్ ను మంజూరు చేస్తాయి. జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా ర్యాంక్ ను పొందగా, సింగపూర్, దక్షిణకొరియా సంయుక్తంగా రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. జర్మనీ, స్పెయిన్ మూడవ స్థానంలో ఉన్నాయి.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ లు 2023
జపాన్ – 193
సింగపూర్, దక్షిణ కొరియా – 192
జర్మనీ, స్పెయిన్ – 190 ఫిన్లాండ్,
ఇటలీ, లక్సెంబర్గ్ -189
ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ – 188
ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ -187
బెల్జియం, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ – 186 ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా – 185
పోలాండ్, హంగేరి – 184
లిథువేనియా, స్లోవేకియా – 183
భారతదేశం ఎక్కడ..?
భారతీయ పాస్ పోర్ట్ 2023లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఇండెక్స్ లో 85వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 59 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్ లు శ్రీలంక, ఇరాన్, ఖతార్, భూటాన్, కాంబోడియా, ఇండోనేషియా, కెన్యా, మారిషస్, మకావో, మాల్దీవులు, నేపాల్, థాయిలాండ్, సీషెల్స్, జింబాబ్వే, ఉగాండా వంటి 59 గమ్యస్థానాలకు వీసాల లేకుండా ప్రయాణించవచ్చు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వీసా ఆన్ అరైవల్ అవసరం కావచ్చు.