World's tallest residential building in Dubai
mictv telugu

ఇసుక నేలలో వంద ఫ్లోర్ల బిల్డింగ్.. అమెరికా రికార్డు బద్ధలు

November 23, 2022

World's tallest residential building in Dubai

ఎడారి ప్రాంతమైన దుబాయ్ ఇప్పటికే అనేక ఘనతలను తన ఖాతాలో వేసుకుంది. ఖర్జూర చెట్టు ఆకారంలో దీవులు, బుర్జ్ ఖలీఫా వంటి పలు ప్రత్యేక ఆకర్షణలు కలిగి ఉంది. ఇప్పుడు మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి వేదిక కాబోతోంది. నగరంలో ఆర్ధిక ప్రాంతంగా పేరున్న బిజినెస్ బేలో వంద ఫ్లోర్లతో హైపర్ టవర్ నిర్మించనుంది. తద్వారా గిన్నీస్ బుక్ లో చోటు సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది.

కేవలం ప్రపంచ రికార్డు సాధించే ఉద్దేశంతోనే ఈ భవనం నిర్మిస్తున్నట్టు నిర్మాణ కంపెనీలు బింఘట్టి, జాకోబ్ అండ్ కోలు మంగళవారం ప్రకటించాయి. ఆ కంపెనీల పేరు మీదుగా భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూయార్క్ లోని మాన్ హట్టన్ స్ట్రీట్ లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఈ భవనంలో 98 ఫ్లోర్లు, ఎత్తు 472 మీటర్లు కలిగి ఉంది. ఇప్పుడీ రికార్డును దుబాయ్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా విలాసవంతమైన నివాస భవనంగానూ పేరు గాంచేలా తీర్చిదిద్దారు. వంద ఫ్లోర్లలో పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్రూంలతో చివరి ఐదు ఫ్లోర్లు అందమైన పెంట్ హౌస్ లను కలిగి ఉంది. అగ్రభాగాలు పూర్తిగా డైమండ్ ఆకారంలో ఉండడం మరో ప్రత్యేకత. రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ భవనం. అయితే ఇంకా ప్రారంభ తేదీని మాత్రం ప్రకటించలేదు.