World's tallest Shiva statue in Rajasthan
mictv telugu

భూమ్మీద అత్యంత ఎత్తయిన శివుని విగ్రహం.. నేటి నుంచి దర్శనం

October 29, 2022

World's tallest Shiva statue in Rajasthan

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుని విగ్రహాన్ని రాజస్థాన్‌లో నెలకొల్పారు. రాజ్ సమంద్ జిల్లాలోని నాథ్ ద్వారాలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 369 అడుగుల ఎత్తు కలిగి ఉండి 20 కిలోమీటర్ల దూరం నుంచి కనపడేలా ఏర్పాటు చేశారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునే ఈ విగ్రహం 250 ఏళ్ళ పాటు నిలిచి ఉండేలా నిర్మించామని నిర్వాహకులు వెల్లడించారు.

3 వేల టన్నులు ఇనుము, ఉక్కు, రెండున్నర లక్షల ఘనపు టన్నుల కాంక్రీట్, ఇసుక వినియోగించిన ఈ విగ్రహ నిర్మాణానికి పదేళ్లు పట్టిందని వివరించారు. శనివారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ‘విశ్వాస్ స్వరూపం’ అని పేరు కలిగిన ఈ విగ్రహాన్ని తత్ పదం సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మెన్ మదన్ పాలీవాలా ఆధ్వర్యంలో నిర్మించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహ ప్రాంగణంలో బంగీ జంప్, గో కార్ట్ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలు ఏర్పాటు చేశారు. నవంబర్ 6 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యకలాపాలు ఉంటాయని పేర్కొన్నారు.