World's toughest zaouli dance video
mictv telugu

ఈ వీడియోలోని స్టెప్పులు ఎన్టీఆర్, రాంచరణ్ కూడా వేయలేరు

January 14, 2023


మన దగ్గర బెస్ట్ డ్యాన్సర్లంటే ప్రభుదేవా, లారెన్స్ ల పేరు చెప్తారు. ఈ మధ్య శేఖర్ మాస్టర్, ప్రేమ్ రక్షిత్ లు వెలుగొందుతున్నారు. నటుల విషయానికి వస్తే టాలీవుడ్ లోనే మంచి డ్యాన్సర్లు కనపడతారు. ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు మంచి డ్యాన్సర్లుగా పేరుపొందారు. ఇక నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ జోడీ వేసిన సిగ్నేచర్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్యాన్స్ అంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మన వాళ్లు ఈ వేగాన్ని అందుకోగలరా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జౌలీ డ్యాన్స్ గా ప్రాచుర్యంలో ఉన్న ఈ నాట్యం విన్యాసాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్ లోని బండమా నదీలోయ ప్రాంతంలో నివసించే గురో తెగల సాంప్రదాయంలో ఒక భాగం ఈ జౌలీ డ్యాన్స్. పురుషులు తరతరాల నుంచి దీన్ని వారసత్వంగా నేర్చుకుంటూ వస్తున్నారు. దుస్తులకు గంటలు, గవ్వలతో పాటు ఇతర తళుకుబెళుకులు ఉంటాయి. ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తుంటారు. మెరుపు వేగంతో అథ్లెట్లా చేసే ఈ డ్యాన్స్ నెటిజన్లను సమ్మెహనపరుస్తోంది.