WORST BEHAVIER OF SRIHAN IN BIGBOSS
mictv telugu

మరీ ఇంత దిగజారిపోవాలా?

November 18, 2022

WORST BEHAVIER OF SRIHAN, BIGBOSS, SESON 6, SRIHAAN, SRI SATYA, GAME, EPISODE

శ్రీహాన్ ఏమైనా రివేంజ్ ప్లాన్ చేస్తున్నాడా? లాస్ట్ సీజన్ లో అతని లవర్ సిరి, షణ్ముఖ్ తో చేసిన ఓవర్ యాక్షన్ మనసులో పెట్టుకుని ఇప్పుడు కసి తీర్చుకుంటున్నాడా? అసలు ఎందు శ్రీహాన్ ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు? ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ ఆరో సీజన్ చూస్తుంటే ఇలాంటి డౌట్లే వస్తున్నాయి. మొదట్లో బాగానే ఉన్న శ్రీహాన్ రోజు రోజుకూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఒంటి మీద స్పృహ ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనిపిస్తోంది.

శ్రీ సత్య, శ్రీహాన్ కొన్ని రోజులుగా క్లోజ్ గా ఉంటున్నారు. ఇది బిగ్ బాస్ చూస్తున్నవాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇది శ్రుతి మించి రాగాన పడుతున్నట్టు ఉంది. శ్రీహాన్ అంతకంతకూ దిగజారిపోతున్నాడు. శ్రీసత్య వెనకాలే తిరుగుతూ హగ్గులు ఇవ్వడం, తను ఏమంటే దానికి తలఊపడం, ఇద్దరూ కలిసి హౌస్ మేట్స్ గురించి చెవులు కొరుక్కోవడం ఇవన్నీ చూస్తుంటే ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తున్నాయి. దీనికి మించి శ్రీహాన్ ఆట మీద దృష్టి పెడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఇలా అయితే ప్రేక్షకులు అతన్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

లాస్ట్ సీజన్ లో ఇదే పని సిరి చేస్తే అందరూ తనని తిట్టిపోశారు. బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్, దీప్తి సునయన అయితే ఏకంగా విడిపోయారు. శ్రీహాన్, సిరిలు విడిపోయి మళ్ళీ కలిశారు. మరి ఇప్పుడు శ్రీహాన్ చేస్తున్నదేమిటో అంటున్నారు ప్రేక్షకులు. అప్పుడు సిరి చేస్తే తప్పు ఇప్పుడు శ్రీహాన్ చేస్తే ఒప్పు అయిపోతాయా అని కూడా అంటున్నారు.

అయితే శ్రీహాన్ కు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. అతని పిఆర్ టీమ్ కూడా గట్టిగానే వర్క్ చేస్తోంది. కాబట్టే ఇంతవరకు రాగలిగాడు. అదే ఇంకొకరు అయితే ఈ పాటికే ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. లాస్ట్ సీజన్ లో సిరి ఎన్ని వేషాలు వేసినా అంతకు మించి ఆట ఆడింది కాబట్టి లాస్ట్ రోజు వరకు ఉండగలిగింది. ఇప్పుడు శ్రీహాన్ కనీసం ఆట కూడా సరిగ్గా ఆడటం లేదు. అతని ప్రవర్తన ఇలానే కొనసాగితే బయట ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా ఆటో కొనసాగడం కష్టమే.

దీనికి తోడు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ కీర్తిని టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు వాగాడు శ్రీహాన్. కీర్తి కెప్టెన్ గా అనర్హురాలు అని అంటూ అడ్డదిడ్డమైన కారణాలు చెప్పాడు. రేవంత్ను కూడా పరమ వరస్ట్ అంటూ నోరుపారేసుకున్నాడు. కీర్తి గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ఇలాగే కంటిస్యూ అయితే ఈ వారం మెరీనా, శ్రీసత్యలకు బదులు శ్రీహాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.