నా మేనల్లుడి నమూనా ఇస్తా, కేటీఆర్ నమూనా ఇస్తావా? పబ్ కేసుపై రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

నా మేనల్లుడి నమూనా ఇస్తా, కేటీఆర్ నమూనా ఇస్తావా? పబ్ కేసుపై రేవంత్

April 5, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌లో గత శనివారం రాత్రి బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దాడిలో భాగంగా పబ్‌లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పీసీసీ రేవంత్ రెడ్డి మేనల్లుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం పీసీసీ రేవంత్ రెడ్డి పబ్ కేసు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.”కేటీఆర్ డ్రగ్స్ కేసు అడ్డుపెట్టుకుని సినిమా వాళ్లను లొంగదీసుకున్నాడు. చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని నాతో రాజకీయాల్లేందిరా చిల్లరనాయాల్లారా?. నా మేనల్లుడి నమూనా ఇస్తా, కేటీఆర్ నమూనా ఇస్తావా?. నా బంధువర్గంలోని పిల్లలను ఏ ఆసుపత్రికైనా తీసుకు వస్తా. అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయిస్తా. మరి, కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు కూడా డ్రగ్స్ టెస్టు చేయిస్తాడా?. పబ్ కేసులో నా వాళ్లు ఉంటే శిక్షించండి. ఈ అంశంలో నేను నైతిక బాధ్యతతో వ్యవహరిస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వమే నాకు కావలిసిన వాళ్లు ఉన్నారని, అందరినీ వదిలేసింది” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అంతేకాకుండా అసలు, ఆ పబ్ 24 గంటలూ నడిచేందుకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. పబ్‌లో దొరికిన 142 మందికి ఎందుకు టెస్టులు చేయలేదు? వారిని ఎందుకు వదిలేశారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పట్టుబడిన వ్యక్తి రేవంత్ మేనల్లుడు అని చెప్తున్నారు కాదా.. అతడు నా మేనల్లుడో కాదా అని వివరించాను. కానీ డ్రగ్స్ వ్యతిరేకంగా కోట్లాడుతున్నాను అంటూ రేవంత్ మండిపడ్డారు.

మరోపక్క ”పబ్‌‌ను నడుపుతున్న నిర్వాహకులు జాతీయ పార్టీ నాయకులు. పబ్‌ ఓనర్‌ అభిషేక్‌ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకు తెలిపారు. అదేవిధంగా ఇంకొంక వ్యక్తి ఉన్నాడు అయన పేరు ప్రణయ్ రెడ్డి. ఈయన పీసీసీ రేవంత్ రెడ్డి మేనల్లుడు” అని బాల్క సుమన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.