Wow!..folding stairs..video viral
mictv telugu

వావ్!..మడతపెట్టే మెట్లు..వీడియో వైరల్

July 16, 2022

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న ఇల్లు, ఆ వ్యక్తి ఎవరో పూర్తి వివరాలు అయితే తెలియదు కానీ, అతడు తయారు చేసిన మడతపెట్టే మెట్లు మాత్రం వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నోటీ నుంచి వావ్! అనేలా చేస్తుంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యానికి లోనై చేసిందని, తనను బాగా ఆకట్టుకుందని ఆయన రాసుకొచ్చారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూసేద్దామా..

వీడియోలో.. ‘ఓ వెల్డర్ అతను తయారు చేసిన మడతపెట్టే మెట్లను పూర్తిగా ఓపెన్ చేసి, ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్లి, కిందికి దిగాడు. ఆ తర్వాత మెట్లను మళ్లీ యథావిధిగా మడతపెడుతున్నాడు’. ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ అంతా ”ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏమాత్రం సృజనాత్మకత, కొత్తదనం లేకపోతే, వెనుకబడిపోవడం ఖాయం. అయితే కొంత మంది మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొన్ని ఆవిష్కరణలు చూస్తే, ఆశ్చర్యం కల్గటం ఖాయం. అందులో ఈ వీడియో ఒకటి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘ప్రస్తుతం ఇళ్లకు మెట్లు ఉండడం అనేది సర్వసాధారణం.దేశ్యవ్యాప్తంగా జనాభా పెరుగుదలతోపాటూ ఇళ్ల స్థలాలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్న విషయం తెలిసిందే. పట్టణాలు, నగరాల్లో కాస్త ఖాళీ స్థలం ఉన్నా బిల్డింగ్‌లను కట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆశ్చర్యం కలిగేలా, అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కూడా కట్టేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే మెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అవసరం లేనప్పుడు వీటిని గోడకు అతుక్కుపోయేలా మడతపెట్టొచ్చు’ అంటూ ఆనంద్ మహేంద్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.