వావ్..365 డేస్ గాల్లోనే చక్కర్లు కొట్టే విమానం..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్..365 డేస్ గాల్లోనే చక్కర్లు కొట్టే విమానం..!

June 3, 2017


విమానం పైకి ఎగిరిదంటే మహా అంటే రెండురోజుల్లో కిందకు దిగాల్సిందే. లేదంటే అంతే సంగతులు..కానీ ఈ విమానం 365 రోజులు ఆకాశంలోనే ఉంటుందట. ఏందీ ఈ గాలిమోటర్ స్పెషల్ అనుకుంటున్నారా.

ఈ చైనా విమానం పేరు కైహంగ్‌. రెయిన్‌బో అని కూడా పేరు. బోయింగ్‌ 737 ప్యాసెంజర్‌ విమానం కన్నా పెద్దదిగా ఉన్న ఈ మానవరహిత కైహంగ్‌.. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ మధ్యే దీన్ని టెస్ట్‌ రన్‌ నిర్వహించగా.. 65వేల ఎత్తుకు చేరుకుంది. సౌరశక్తితో నడిచే మానవ రహిత విమానాలు 65వేల ఎత్తుకు చేరుకోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. గతంలో యూఎస్‌, యూకేకు చెందిన సౌరశక్తి డ్రోన్లు ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిని విపత్తు పర్యవేక్షణ, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఉపయోగిస్తారు. సౌరశక్తితో నడిచే అతిపెద్ద మానవ రహిత విమానం వివరాలను చైనా చాలా రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. టెస్ట్‌ పూర్తయ్యాక సీఏఏఏ డ్రోన్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సీ వెన్‌ ఈ వివరాలను బహిర్గతం చేశారు.