వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు సమయం ఆసన్నమైంది. wpl-2023 లీగ్ ప్రారంభోత్సవేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ అందాలు కియారా అద్వాణీ, కృతి సనన్‌లు సందడి చేస్తున్నారు. అలాగే ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్.. ప్రముఖ ర్యాపర్, గాయకుడు ఏపీ ధిల్లాన్ పాటలు అభిమానులను ఉర్రూతలు ఊగిస్తున్నాయి. మరికాసేపట్లో (8 గంటలకు) మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ వుమెన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది.ఇది మొదటి వుమెన్స్ ఐపీఎల్ కావడంతో ఆసక్తి నెలకొంది. సత్తా చాటేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. యువ ఆటగాళ్ళకు ఈ టోర్నీ అద్భుత అవకాశం.
23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 5 జట్లు తలపడుతున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు జరిగేలా ప్లాన్ చేశారు. ఈనెల 26వ తేదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్ని ముంబైయిలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్ స్టేడియంలో జరగనున్నాయి. స్పోర్ట్స్ 18 నెట్ వర్క్‌లో మ్యాచ్‌ను వీక్షించొచ్చు. జియో సినిమా యాప్‌లో కూడా చూసే అవకాశం ఉంది.