వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మెరుపులు మెరిశాయి. పురుషుల ఐపీఎల్‌కు తీసిపోనట్టు అమ్మాయిలు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ వుమెన్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 65 పరుగులు చేసి తొలి డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్థశతకం నమోదు చేసింది. కేవలం 22 బంతుల్లోనే 11 ఫోర్ల సాయంతో ఫిఫ్టీ సాధించింది. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి బౌండరీలతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. మాథ్యూస్ 47, కెర్ 45 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో న్నేహ్ రాణా 2, వారెహమ్, గార్డెనర్, తనూజా కన్వార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.